దమ్ముంటే అరెస్ట్ చేయండి, జై శ్రీరాం కామెంట్లపై దీదీకి అమిత్ షా సవాల్

కానింగ్ : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న నేతల మధ్య విమర్శల జడివాన మాత్రం తగ్గడం లేదు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీదీ మమతా లక్ష్యంగా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శలు చేస్తుండగా ... అదే రేంజ్ లో మమతా కౌంటర్ అటాక్ చేస్తూ ఫైర్ బ్రాండ అని నిరూపించుకుంటున్నారు.

విజయాన్ని అడ్డుకోలేరు ...

విజయాన్ని అడ్డుకోలేరు ...

బెంగాల్ లో ర్యాలీ తీయకుండా సీఎం మమతా అడ్డుకుంటారెగాని .. బీజేపీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరని అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్ లోని జాయ్ నగర్ లో షా .. ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఎవరైనా జై శ్రీరాం అంటే మమతక పట్టరాని కోపం వస్తోంది. ఇక్కడ నేను ఇంతమంది ముంద జైశ్రీరాం అని గట్టిగా అంటున్నాను. ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు అని సవవాల్ విసిరారు. అంతేకాదు మరో 24 గంటలు కోల్ కతాలోనే ఉంటానని .. దమ్ముంటే అరెస్ట్ చేయాలని మమతకు సవాల్ కు విసిరారు.

విమానానికి నో పర్మిషన్

విమానానికి నో పర్మిషన్

బెంగాల్ లో ఎన్నికల ర్యాలీలో అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా విమానాన్ని బరైపూర్ లో దిగేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ర్యాలీలు నిర్వహించకుండా తనను అడ్డుకోగలరని ... బీజేపీ ఆధిక్యాన్ని ఆపలరేని స్పష్టంచేశారు. ఇది మమతే కాదు ఎవరితరం కాదని స్పష్టంచేశారు.

మోదీ, షాపై నిప్పులు

మోదీ, షాపై నిప్పులు

ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా చేస్తున్న జై శ్రీరాం నినాదాన్ని మమత తప్పుపట్టారు. తాను జైశ్రీరాం అననని తేగేసి చెప్పారు. జై హింద్, వందేమాతరం అంటానే తప్ప జై శ్రీరాం అననని స్పష్టంచేశారు. ఒకవైళ జై హిందు అని బీజేపీ అంటే తను జై బెంగాల్ అనాల్సి వస్తోందని హెచ్చరించారు. మమతా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఖండించారు. ఇవాళ అమిత్ షా .. ఆమె వ్యాఖ్యలను ఉటంకిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+