పుటేజీలో దొరికారు: ఆసుపత్రిలో కాల్పులు, ఒకరు మృతి (వీడియో)
భోపాల్: ఇంటర్నెట్‌లో ఓ సీసీటీవి పుటేజీ సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా ఆసుపత్రిలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తిని మరో వ్యక్తి గన్‌తో కాల్పి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బింద్ జిల్లాలోని జమునా గ్రామానికి చెందిన విమలేష్ ఉపాధ్యాయ్, సంజు, ధర్మేంద్రలు మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లారు. ఆనంతరం ఫోన్‌లో గొడవపడ్డారు. ఆ తర్వాత సంజు, ధర్మేంద్రలిద్దరూ కలిసి విమలేష్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు.

వీరి గొడవ తారాస్ధాయికి చేరడంతో ధర్మేంద్ర అనే వ్యక్తి గన్‌తో కాల్పులు జరపడంతో సంజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఆసుపత్రిలో విమలేష్, ధర్మేంద్ర ఉపాధ్యాయ్‌లు గొడవ పడ్డారు.
విమలేష్ పరిగెత్తుకొని వెళ్లి ప్రసూతి వార్డులో దాక్కోగా, ధర్మేంద్ర తరుముకుంటూ వచ్చి గన్‌తో కాల్చి చంపాడు. చనిపోయాడని నిర్ధారించుకునే వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. సంజు పరిస్థితి విషమంగా ఉండడంతో గ్వాలియర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications