విధి విచిత్రం: టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ బోల్తా.. ముగ్గురు మృతి
అప్పుడప్పుడు జరిగే ప్రమాదాలు విస్మయానికి గురిచేస్తాయి. కర్ణాటక ఉడుపిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. రోగిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఓ అంబులెన్స్ ప్రమాదానికి గురయ్యింది. రోగిని త్వరగా ఆసుపత్రికి తరలించే క్రమంలో వేగంతో వచ్చిన అంబులెన్స్ టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పింది. అక్కడ పనిచేసే సిబ్బందిని ఢీకొట్టింది. ఆపై జారుకుంటూ అల్లంత దూరం వెళ్లి బోల్తా పడింది. ఆ అంబులెన్స్ ఉడుపి జిల్లాలోని హొన్నావర నుంచి కుందాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

అంబులెన్స్ డ్రైవర్ సహా ముగ్గురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ టోల్ ప్లాజాకు సమీపిస్తున్న సమయంలో వాహనాల దారిలో పడిపోయిన ఓ డివైడర్‌ను తీసేందుకు వెళ్లిన టోల్ ప్లాజా ఉద్యోగి... అంబులెన్స్ వేగంగా రావడం చూసి ఆశ్చర్యపోయాడు. అంబులెన్స్ నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. వేగంగా వచ్చి అడ్డంగా తిరిగిన అంబులెన్స్ తొలుత టోల్ ప్లాజా వద్ద ఉద్యోగినే ఢీకొట్టింది. ఆపై నేలపై జారుకుంటూ వెళ్లి పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ కేబిన్‌లోని వారంతా టాప్ లేచిపోవడంతో ఎగిరి పడ్డారు.
కర్నాటక ఉడిపిలో టోల్‌ప్లాజా వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ అంబులెన్స్#Ambulance #oneindiatelugu #udipi #TollPlazaAccident pic.twitter.com/JvDA4k1M6b
— oneindiatelugu (@oneindiatelugu) July 21, 2022
అంబులెన్స్ ఉడుపి జిల్లాలో గల ఓ ప్రైవట్ ఆస్పత్రికి చెందింది. ప్రమాదం చూసిన వారు ఇదేంటి ఇలా జరిగిందని నోరెళ్లబెడుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళుతూ ఇలా ప్రమాదం జరగడంతో.. మొత్తం ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications