కావేరీ నీటి గొడవ: క్యాప్టెన్ విజయ్ కాంత్ అడ్రస్ లేడు
చెన్పై: డీఎండీకే చీఫ్ క్యాప్టెన్ విజయ్ కాంత్ మాయం అయ్యారు. కావేరీ జలాల పంపణి విషయంలో, బెంగళూరులో తమిళ ప్రజల మీద దాడులు జరిగాయని ఆరోపిస్తు శుక్రవారం తమిళనాడు బంద్ జరిగింది.
తమిళనాడు బంద్ లో డీఎండీకే చీఫ్ విజయ్ కాంత్ కనపడకపోవడంతో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. తమిళ ప్రజల మీద దాడులు చేస్తే సహించనని, కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చెయ్యకుంటే తాను నీరాహారదీక్ష చేస్తానని ఇటీవల విజయకాంత్ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే శుక్రవారం జరిగిన బంద్ సందర్బంగా విజయ్ కాంత్ ఎక్కడా పాల్గొనలేదు. డీఎండీకే తరపున విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత విజయ్ కాంత్ డీఎండీకే కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తరువాత బంద్ లో పాల్గొన్నారు.

విజయ్ కాంత్ చెప్పిన మాట మీద నిలబడతారని, బంద్ లో ఉత్సాహంగా పాల్గొంటారని ఆపార్టీ నాయకులు భావించారు. అయితే సీన్ రివర్స్ కావడంతో డీఎండీకే కార్యకర్తలు డీలా పడ్డారు.
విజయ్ కాంత్ కు అనారోగ్యంగా ఉందని, అందుకే తమిళనాడు బంద్ లో పాల్గొనలేదని ఆపార్టీ నాయకులు అంటున్నారు. అయితే బంద్ సందర్బంగా గొడవలు జరిగితే గతంలో అమ్మతో చాలెంజ్ చేసిన విజయ్ కాంత్ చిక్కుల్లో పడతారని, అందుకే బంద్ లో పాల్గొనలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications