‘కావేరి బోర్డు’పై ఎందుకింత అలసత్వం?, మే3లోగా తేల్చేయండి: కేంద్రంపై సుప్రీం ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై సోమవారం కేంద్రంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, తక్షణమే కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
కావేరి బోర్డు ఏర్పాటు చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. మే 3లోపు కావేరి బోర్డు ఏర్పాటు ముసాయిదాను తమకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసును మే 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో పలువురు తమిళ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు కూడా కావేరి బోర్డు ఏర్పాటు చేయలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications