కావేరి కావాలి: సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడు
న్యూఢిల్లీ: కావేరీ పరిరక్షణ కమిటీ ఆదేశాలను లెక్కచెయ్యకుండా కర్ణాటక ప్రభుత్వం ఎదురు తిరుగుతుందని ఆరోపిస్తూ తమిళనాడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం తమిళనాడు ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.
తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని కావేరీ పరిరక్షణ కమిటీ, సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం ఇదే సందర్బంలో కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అయితే కర్ణాటక ప్రభుత్వం మొండి వైఖరితో కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చెయ్యలేదని కోర్టులో చెప్పారు.

తమిళనాడుకు ఇంకా 17.5 టీఎంసీల నీరు రావాలని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఎదో ఒక వంకతో కావేరీ నీరును వదలకుండా కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications