పద్మావతి సినిమాకు సర్టిఫికేట్ ఎందుకివ్వలేదో చెప్పిన సెన్సార్ బోర్డు సీఈవో
సెన్సార్ బోర్డు పద్మావతి సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా తిరిగి పంపించింది. నిర్మాతలు సర్టిఫికేషన్ కోసం పంపిన దరఖాస్తును పూర్తిగా పూరించలేదని దీంతో సర్టిఫికెట్ మంజూరు చేయలేదని సభ్యులు చెప్పారు.
ముంబై: సెన్సార్ బోర్డు పద్మావతి సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా తిరిగి పంపించింది. నిర్మాతలు సర్టిఫికేషన్ కోసం పంపిన దరఖాస్తును పూర్తిగా పూరించలేదని దీంతో సర్టిఫికెట్ మంజూరు చేయలేదని సభ్యులు చెప్పారు.
అయితే ఈ విషయం గురించి సెన్సార్ బోర్డు సీఈవో అనురాగ్ శ్రీవాస్తవ్ స్పష్టత ఇచ్చారు. సినిమాను ఫిక్షన్ ఆధారంగా తీశారా? లేదా చరిత్ర ఆధారంగా తీశారా? అని దరఖాస్తులో ఉన్న ప్రశ్నకు నిర్మాతలు సమాధానాన్ని రాయలేదన్నారు.

దీన్ని అలాగే ఖాళీగా వదిలేశారన్నారు. సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో నిర్మాతల జవాబు తెలుసుకోవడం తమకు అవసరమన్నారు.
నిబంధనల ప్రకారం సీబీఎఫ్‌సీ ఓ సినిమాను సర్టిఫై చేయడానికి 68 రోజులు తీసుకోవచ్చునని చెప్పారు. పద్మావతి యూనిట్ సెన్సార్ పూర్తి చేసుకోకుండానే విడుదల తేదీ ప్రకటించింది కాబట్టి విడుదల వాయిదా పడిందన్నారు.












Click it and Unblock the Notifications