ట్విస్ట్: భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి చివరికిలా...
పథకం ప్రకారం భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఓ రాజకీయ నాయకుడి బండారాన్ని బయటపెట్టారు సిబిఐ అధికారులు. నిందితుడిపై పోలీసులు చార్జీషీటు దాఖలు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్:పక్కా ప్లాన్ తో కట్టుకొన్న భార్యను హత్య చేసి ప్రమాదమని నమ్మించిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకుడి గుట్టును రట్టు చేసింది సిబిఐ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిందితుడు పోటీచేస్తున్నాడు.
ఉత్తర్ ప్రదేశ్ లోని నౌతాన్వా స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఆమన్ మణి త్రిపాఠి పోటీచేస్తున్నాడు. అయితే
ఆమన్ మణి త్రిపాఠి తన భార్య సారాసింగ్ ను గొంతు నులిమి చంపాడని ఆయనపై సిబిఐ శనివారం నాడుచార్జీషీట్ నమోదుచేసింది.

ఫిరోబాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సారా చనిపోయిందని మణి చెప్పింది. అయితే ఆమన్ మణి చెప్పింది కట్టుకథ ని పోలీసులు తేల్చారు.
పెళ్ళి తర్వాత సారాను ఆమన్ హింసించేవాడని విచారణలో వెల్లడైందని సిబిఐ ప్రతినిధి ఆర్ కె గౌర్ చెప్పారు. 2015 జూలై 9వ. తేదిన రోడ్డు ప్రమాదం నాటకం ఆడి భార్యను హత్య చేశాడని తెలిపారు.
నేరపూరితమైన కుట్ర, హత్య, వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్ మాజీ మంత్రి అమర్ మణి త్రిపాఠి కుమారుడైన అమన్ కు తొలుత సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. అయితే ఆ తర్వాత అతడికి ఇచ్చిన టిక్కెట్టును రద్దుచేసి మున్నాసింగ్ కు ఇవ్వడంతో ఆమన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాడు.












Click it and Unblock the Notifications