Delhi Liquor Scam: మనీష్ సిసోడియాపై మరో కేసు ఫైల్ చేసిన సీబీఐ..
మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు ఫైల్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు ఫైల్ చేసింది. ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ కేసులో సీబీఐ జైల్లో ఉన్న సిసోడియాపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్ లో మనీష్ సిసోడియాతో పాటు ఏడుగురిని చేర్చింది.

నేరపూరిత కుట్ర
కాగా కొద్ది రోజుల క్రితం సిసోడియాను ప్రాసిక్యూటు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, ఫోర్జరీ, నకిలీ డూక్యుమెంట్లు ఉపయోగించారని అభియోగాలు నమోదు చేసింది.

ఎమ్మెల్సీ కవిత
ఎఫ్ఐఆర్ లో ఉన్నవారిలో ఢిల్లీ ప్రభుత్వ మాజీ విజిలెన్స్ సెక్రటరీ సుకేష్ కుమార్ జైన్, సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ రాకేష్ కుమార్ సిన్హా, అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు, జాయింట్ డైరెక్టర్ ఉన్నారు. కాగా గురువారం రోజు ఈడీ విచారణ కు హాజరు కావాల్సి ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య కారణాల రీత్యా రాలేనని ఈడీకి తెలిపింది.

సోమ భరత్
ఇందుకు సంబంధించి కవిత తరఫు న్యాయవాది సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వచ్చి పలు పత్రాలు ఇచ్చాడు. గతంలో కవితను ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా విచారించారని అన్నారు. సెల్ ఫోన్ బలవంతంగా తీసుకున్నారని, మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 15 కింద మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలను ఇంటికొచ్చి విచారించాల్సి ఉందన్నారు. విచారణను సాయంత్రం ఆరు గంటలలోపు పూర్తి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications