చిట్‌ఫండ్ స్కామ్: ఎంపి, మాజీ ఎమ్మెల్యేల అరెస్టు

భువనేశ్వర్: చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ఒడిషా అధికార బిజెడికి మరో ఎదురు దెబ్బ తగిలింది. బిజెపి మయూర్‌భంజ్ పార్లమెంటు సభ్యుడు రామచంద్ర హంన్స్‌డా, మాజీ శాసనసభ్యులు సుబర్ణ నాయకు, హితేష్ బాగర్తిలను సిబిఐ మంగళవారంనాడు అరెస్టు చేసింది. ఒడిషాలో కోట్లాది రూపాయల చిట్‌ఫండ్ కుంభకోణంతో సంబంధాలున్నాయనే ఆరోపణపై సిబిఐ వారిని అరెస్టు చేసింది.

క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల మళ్లింపు ఆరోపణలపై సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ ముగ్గురిని అరెస్టు చేసింది. పొంజి గ్రూప్‌నకు చెందిన నబడిగంట క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఆ ముగ్గురు వ్యవహరించారు. వేలాది మంది ఇన్వెస్టర్లను మోసం చేశాయనే ఆరోపణలపై 44 పొంజీ కంపెనీలపై సిబిఐ దర్యాప్తు జరుపుతోంది.

CBI arrests BJD MP Ramchandra Hansda, 2 ex-MLAs in ponzi scam

రామచంద్రతో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను సిబిఐ విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసి, విచారించి, కొద్ది గంటల తర్వాత ఆరెస్టు చేసింది. మయూర్‌గంజ్‌లోని రామచంద్ర నివాసంలో సిబిఐ అధికారులు జులైలో సోదాలు నిర్వహించి 28 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు తన సొంతానిదని రామచంద్ర చెప్పారు.

తన నివాసంలో సిబిఐ స్వాధీనం చేసుకున్న నగదులో కొంత పార్టీది, పార్టీ కార్యకర్తలదని ఆయన అన్నారు. కుట్రకు తాను పావుగా మారానని ఆయన అన్నారు. కాంగ్రెసుకు చెందిన నబడిగంట డైరెక్టర్లలో ఒకరైన ప్రదీప్ పట్నాయక్ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 26వ తేదీన నబడిగంట సిఎండి అంజన్ బాలియార్ సింగ్, మరో ఇద్దరు డైరెక్టర్లు కార్తిక్ పరిదా, ప్రదీప్ పట్నాయక్‌లను సిబిఐ అరెస్టు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+