లంచం తీసుకుని అడ్డంగా సీబీఐకి దొరికిపోయిన ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్!
ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్డంగా సీబీఐ చేతికి దొరికిపోయారు. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్న కేసులో ఈడీ కీలక ఉద్యోగి శశి శేఖర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్డంగా సీబీఐ చేతికి దొరికిపోయారు. ఓ వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్న కేసులో ఈడీ కీలక ఉద్యోగి శశి శేఖర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
రాజ్‌కుమార్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వ్యాపారితో ఓ విషయంలో శశి శేఖర్ డీల్ కుదుర్చుకున్నారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ లంచం తీసుకుంటున్నారని సమాచారం అందుకున్న సీబీఐ శశి శేఖర్‌పై కేసు నమోదు చేసింది.

లంచం తీసుకున్న శేఖర్‌తో పాటు, లంచం ఇచ్చిన అగర్వాల్, అతడి సన్నిహతులు కొందరిపై ఐపీసీ 120-బీ సెక్షన్, 7, 12, 13(1), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు సీబీఐ అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications