టెలిఫోన్ ఎక్స్చేంజీ స్కామ్ కేసులో మారన్ సోదరులకు ఊరట

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టెలిఫోన్ ఎక్స్ఛేంజీ కుంభకోణం కేసులో మారన్ సోదరులకు ఊరట లభించింది. అక్రమ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీ కుంభకోణం కేసు నుంచి సిబిఐ కోర్టు దయానిధి మారన్, కళానిథి మారన్‌లపై అభియోగాలను రద్దు చేసింది.

వారిపై ఆరోపణలను రుజువు చేసే ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవనే కారణంతో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి నటరాజన్ ఏడుగురు నిందితులకు కూడా విముక్తిని ప్రసాదించారు. దయానిధి, కళానిధి, ఇతర నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జీ పిటిషన్లను వ్యతిరేకిస్తూ సిబిఐ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వాదిస్తూ వచ్చింది.

CBI court discharges Maran brothers in illegal telephone exchange scam

వారిపై విచారణకు తమ వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని సిబిఐ వాదించగా, తాము అమాయకులమని, ఏ విధమైన నష్టం కూడా కలిగించలేదని మారన్ సోదరులు, ఇతర నిందితులు వాదిస్తూ వచ్చారు.

అక్రమ సన్ టీవీ డేటా అప్ లింక్ కోసంతన నివాసం నుంచి దయానిధి మారన్ 764 టెలిఫోన్ లైన్లతో ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీని ఏర్పాటు చేశారని దానివల్ల చెన్నై బిఎస్ఎన్ఎల్‌కు ఢిల్లీ ఎంటిఎన్ఎల్‌లకు రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former telecom minister Dayanidhi Maran and his brother Kalanithi Maran have been discharged by a CBI court in an alleged illegal telephone exchange scam case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి