లాలూ ప్రసాద్‌కు శిక్ష ఖరారు: సీబీఐ కోర్టు సంచలన తీర్పు: జైలు..లక్షల్లో జరిమానా
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దాణా కుంభకోణంతో ముడిపడి ఉన్న అయిదు కేసుల్లోనూ ఆయనను దోషిగా నిర్ధారించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కొద్ది సేపటి కిందటే శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు తుది తీర్పును వెలువడించింది.

రూ.950 కోట్ల స్కామ్
ఈ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో బిహార్‌లో చోటు చేసుకున్న ఈ దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 1996లో తొలిసారిగా ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పశుసంవర్ధక శాఖపై అధికారులు నిర్వహించిన దాడుల సందర్భంగా ఈ కుంభకోణాన్ని గుర్తించారు. ఈ కుంభకోణం విలువ 950 కోట్ల రూపాయలు.

అన్నింట్లోనూ దోషిగా..
ఈ కుంభకోణంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. లాలూ ప్రసాద్‌ను నిందితుడిగా గుర్తిస్తూ 1997 జూన్‌లో ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. లాలూతో పాటు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా పేరును ఇందులో చేర్చారు. లాలూ ప్రసాద్‌పై మొత్తం అయిదు కేసులు నమోదయ్యాయి. ఈ అయిదింట్లోనూ ఆయన దోషిగా తేలారు. దొరండా ట్రెజరీ నుంచి 139.50 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసినట్లు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తాజాగా నిర్ధారించింది.

ట్రెజరీల నుంచి విత్‌డ్రా..
దీనితో దాణా కుంభకోణంలో నమోదైన అయిదు కేసుల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలినట్టయింది. ఛాయ్‌బాసా ట్రెజరీ నుంచి రెండు విడతల్లో రూ.37.7 కోట్లు, 33.13 కోట్లు, దేవ్‌గఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 కోట్లు, దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్ల రూపాయలను పశువుల దాణాను కొనుగోలు చేయడానికి విత్‌డ్రా చేశారని, ఆ మొత్తాన్ని మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసులన్నింట్లోనూ లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. అయిదో కేసు- దొరండా ట్రెజరీ నుంచి విత్‌డ్రా. ఇందులో కూడా ఈ నెల 15వ తేదీన సీబీఐ న్యాయస్థానం లాలూను దోషిగా గుర్తించింది.
Recommended Video

శిక్ష ఖరారు..
ఆయనకు విధించాల్సిన శిక్షను ఖరారు చేసింది. కొద్దిసేపటి కిందటే రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తుది తీర్పును వెలువడించింది. లాలూ ప్రసాద్‌కు అయిదు సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. దీనితో పాటు 60 లక్షల రూపాయల భారీ జరిమానాను విధించింది. తొలి నాలుగు కేసుల్లో లాలూకు 14 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఆయన ఇప్పటికే జైలు శిక్షను అనుభవించారు. అనారోగ్య కారణాలతో సీబీఐ న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications