వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొగ్గు కుంభకోణం: మన్మోహన్‌ను విచారించిన సిబిఐ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సిబిఐ ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి ఇటు సీబీఐగానీ, అటు మన్మోహన్‌గానీ ఇష్టపడటం లేదు.

ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కో సంస్థకు ఒడిశాలోని తాలాబిరా బొగ్గు బ్లాక్-2 కేటాయింపు విషయంలో రెండురోజుల కిందట మన్మోహన్‌ను ఆయన నివాసంలో సీబీఐ అధికారుల బృందం విచారించిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జనవరి 27న ఈ కేసుకు సంబంధించిన ప్రగతి నివేదికను సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేయనున్న నేపథ్యంలో ఆయనను ప్రశ్నించినట్టు చెప్పాయి.

CBI examines former PM Manmohan Singh in coal scam

సీబీఐ అధికార ప్రతినిధి కంచన్‌ప్రసాద్ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. నిరాకరించనూలేదు. మరోవైపు మన్మోహన్ అనుచరుడొకరు ఈ వార్తలను తోసిపుచ్చారు. 2005లో బొగ్గు మంత్రిత్వశాఖ అప్పటి ప్రధాని మన్మోహన్ వద్ద ఉన్న సమయంలో హిందాల్కోకు తాలాబిరా బ్లాక్‌ను కేటాయించారు.

2005 మే 7, జూన్ 17న ఈ బ్లాక్‌ను హిందాల్కోకు కేటాయించాల్సిందిగా ప్రధానిని కోరుతూ కుమార మంగళం బిర్లా రెండు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో హిందాల్కోకు బొగ్గు గని కేటాయించే సమయంలో బొగ్గు మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యాలయంలో ఏమేం పరిణామాలు జరిగాయో తెలుసుకునేందుకు మన్మోహన్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.

English summary
The CBI has examined former PM Manmohan Singh in connection with the coal block allocation scam, according to sources. CBI, however, has neither confirmed nor denied the information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X