మద్యం పాలసీలో సంచలనం..!!
Liquor Policy: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఉచ్చు మరింత బిగుసుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. తీహార్ జైలులో ఉంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ అధికారుల అదుపులో ఉన్నారామె. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉంటోన్నారు.

ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌పై ఛార్జ్‌షీట్ నమోదు అయింది. సీబీఐ అధికారులు ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. ఈ కేసును విచారిస్తోన్న ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానానికి ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. న్యాయమూర్తికి సమర్పించారు.
నిజానికి- మద్యం పాలసీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారనిస్తోన్న కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఈ మేరకు గతంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది ఈడీ అధికారులకు. అయినప్పటికీ- కేజ్రీవాల్ ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు.
దీనికి కారణం- మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోండటమే. తాజాగా సీబీఐ అధికారులకు ఆయనపై ఛార్జ్‌షీట్‌ను నమోదు చేయడం, దాన్ని ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానానికి సమర్పించడం చకచకా సాగాపోయాయి. ఈ పరిణామం- ఆమ్ ఆద్మీ పార్టీకి పెను విఘాతంలా పరిణమించింది.

ఇటీవలే ఆయన జ్యుడీషియల్ కస్టడీనీ రోస్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది కూడా. జూలై 25వ తేదీ నాటితో కస్టడీ ముగియగా.. కేజ్రీవాల్‌ను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు సీబీఐ అధికారులు. ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తమకు సహకరించట్లేదని అదనపు సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు.
కేసు నుంచి తప్పించుకునేలా, తనకు ఏ మాత్రం సంబంధం లేనివిధంగా వ్యవహరించారని కోర్టుకు వివరించారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలను ఇచ్చారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. కేజ్రీవాల్ రిమాండ్‌ను ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగించింది.












Click it and Unblock the Notifications