మారుతి మాజీ ఎండీ జగదీష్ కట్టర్‌కి సీబీఐ షాక్.. కుట్ర, చీటింగ్ అంటూ ఎఫ్ఐఆర్
ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి ఉద్యోగ్ కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ కట్టర్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. రూ.110 కోట్ల బ్యాంక్ లోన్ కుంభకోణంలో ఆయనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కట్టర్‌పై బ్యాంక్‌ను మోసగించారనే ఆరోపణలను పేర్కొన్నది.
జగదీశ్ కట్టర్, ఆయన కంపెనీ కార్నేషన్ ఆటో లిమిటెడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.110 కోట్ల నష్టాన్ని చేసింది. బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశాం. ఆయన 1993 నుంచి 2007 వరకు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌లో పనిచేశారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో రిటైర్ అయ్యారు అని పోలీసులు ఐఎఫ్ఆర్‌లో పేర్కొన్నారు.

మారుతి ఎండీగా రిటైరైన తర్వాత కార్నేషన్ అనే కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ కోసం రూ.170 కోట్ల రుణాన్ని 2009లో పొందారు. ఆ తర్వాత 2012 వరకు కొంత మొత్తాన్ని చెల్లించారు. 2015 నుంచి ఆయన లోన్‌ను నిరర్థక ఆస్తులగా పరిగణించాం. ఎగవేతకు పాల్పడిన మిగితా మొత్తాన్ని రాబట్టేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని ఫిర్యాదులో బ్యాంక్ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.
ఇక ఈ కేసులో మరోకరిపై కూడా చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తీసేందుకు ప్రముఖ ఆడిటింగ్ సంస్థతో ఫొరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించారు.
బ్యాంక్‌లో సెక్యూరిటీ పెట్టిన 66 కోట్లకుపైగా ఆస్తిని ఉద్దేశపూర్వకంగా 4.5 కోట్లకు అమ్మడం జరిగింది. బ్యాంక్ అనుమతి లేకుండా ఆస్తులను తక్కువ ధరకు అమ్ముకోవడం ద్వారా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే విషయం ఆడిట్‌లో బయటపడింది. దాంతో పలు నివేదికలు, సాక్ష్యాలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు చీటింగ్, కుట్ర అంశాల ఆధారంగా జగదీష్ కట్టర్‌పై ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.
జగదీష్ కట్టర్‌తోపాటు మొత్తం ఐదుగురిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీన సీబీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదులో M/s కట్టర్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, M/s కార్నేషన్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, M/s కార్నేషన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లను పేర్కొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications