దళిత చిన్నారుల సజీవదహనం: సీబీఐ దర్యాప్తు
ఫరీదాబాద్: దళిత చిన్నారులను సజీవదహనం చేసిన కేసు సీబీఐకి అప్పగిస్తున్నామని హరియాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫరీదాబాద్ జిల్లా సంపేడ్ గ్రామంలో నివాసం ఉంటున్న జితేందర్ అనే వ్యక్తి ఇంటిలో పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే.
ఈ మంటలలో రెండున్నరేళ్ల వైభవ్, 11 నెలల దివ్యా అనే ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. దళిత సంఘాలు చిన్నారుల మృతదేహాలతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా వెళ్లి ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిలో ధర్నా నిర్వహించారు.
పరిస్థితి విషమించడంతో ధర్నా చేస్తున్న వారి మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరిన హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

చిన్నారుల హత్య కేసులో బల్వంత్, ధరమ్ సింగ్, కర్తార్, సంజయ్ అనే నలుగురిని అరెస్టు చేశామని డీసీపీ పూర్ణచంద్ తెలిపారు. మొత్తం 11 మంది మీద కేసు నమోదు చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దళిత చిన్నారుల హత్య కేసును పలు పార్టీలు ఖండిచాయి. గతంలో జరిగిన మూడు హత్యల కేసులతో జితేందర్ కు సంబంధం ఉందనే అనుమానంతోనే అతని ఇంటికి నిప్పటించారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications