సీబీఐ రాడార్‌లో సీనియర్ రాజకీయ నేత కూతురు- ఇంట్లో సోదాలు..ఛార్జ్‌షీట్ ప్రిపేర్ !!
సీబీఐ, ఈడీ దర్యాప్తును తాలిబన్, అల్ ఖైదా తరహాలో కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని ఉద్ధవ్ థాకరే వర్గం సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో సీబీఐ అధికారులు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. దేశ రాజధానిలోని తీహార్ కేంద్ర కారాగారంలో ఆయనను విచారిస్తోన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆయన కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం పొడిగించిన నేపథ్యంలో- ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉంటోన్నారు.
మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ బీజేపీ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- సీబీఐ రంగంలోకి దిగింది. తాజాగా- అటు బిహార్ రాజకీయాలపైనా సీబీఐ అధికారులు దృష్టి సారించారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంపై సోమవారం దాడులు చేశారు. విస్తృతంగా సోదాలను నిర్వహించారు.

రబ్రీదేవిని విచారించారు. ఉదయం 9:30 గంటలకు పాట్నాలోని రబ్రీదేవి నివాసంలో ఆరంభమైన ఈ విచారణ సాయంత్రం వరకూ కొనసాగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. సీబీఐ అధికారులు రబ్రీదేవిని విచారిస్తోన్నారనే విషయం తెలిసిన వెంటనే రాష్ట్రీయ జనతాదళ్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి ఆమె నివాసానికి చేరుకున్నారు.
సీబీఐ అధికారులు అక్కడితో ఆగలేదు. మరో అడుగు ముందుకేశారు. లాలూ ప్రసాద్ యాదవ్-రబ్రీదేవి కుమార్తె మీసా భారతి ఇంటిపైనా దాడులు చేశారు. ఢిల్లీలోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. విచారణ సాగిస్తోన్నారు. పలు కీలక డాక్యుమెంట్లను వారు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం ఆరోపణలను మీసా భారతి ఎదుర్కొంటోన్నారు. ఇదే కుంభకోణం వ్యవహారంలో రబ్రీదేవి- సీబీఐ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అటు లాలూ ప్రసాద్ యాదవ్ కు కూడా నోటీసులను అందజేశారు. ఆయనను కూడా విచారిస్తోన్నారు సీబీఐ అధికారులు.

ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, మీసా భారతి, రైల్వే జనరల్ మేనేజర్ సహా 13 మందిపై ఛార్జ్ షీట్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. 2004-2009 మధ్యకాలంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పని చేసినప్పుడు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అప్పట్లో రైల్వేలో ఉద్యోగాలను పొందిన వారి నుంచి నకిలీ ట్రాన్ ఫర్ సర్టిఫికెట్లు, ఇతర ల్యాండ్ డాక్యుమెంట్లను సేకరించారని, రైల్వే ఉద్యోగాల్లో తప్పనిసరిగా భావించే మెడికల్ ఫిట్ నెస్ పరీక్షల్లో కూడా వారు పాల్గొనలేదని తేలింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications