• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుశాంత్‌ డెత్ కేసులో డెప్త్‌: బెడ్‌రూమ్‌లో టార్చర్: దిశా సలియాన్ మృతిపైనా సీబీఐ: కేంద్రమంత్రి

|

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసుపై ప్రస్తుతం కొనసాగుతోన్న విచారణ మరింత లోతుల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డెత్ కేస్‌లో తీగ లాగితే బాలీవుడ్ డ్రగ్స్ డొంక మొత్తం కదిలొస్తోంది. ఏ మాత్రం ఊహించిన పేర్లు డ్రగ్స్ రాకెట్‌లో వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్ పెడ్లర్స్ ఏ స్థాయిలో బాలీవుడ్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నారనేది ఈ విచారణతో ఒక్కటొక్కటిగా బహిర్గతమౌతూ వస్తోంది. టాప్ హీరోయిన్లకు డ్రగ్స్ రాకెట్‌తో ప్రమేయం ఉన్నట్లు వస్తోన్న వార్తలు యావత్ దేశాన్ని నివ్వెరపరుస్తున్నాయి.

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. జయసాహా సంచలనం : శ్రద్ధా కోసం డ్రగ్ ఆర్డర్ .. సుశాంత్ తాగే టీలో ఆ డ్రగ్

ఎన్సీబీ కార్యాలయం ముందు బారులు..

ఎన్సీబీ కార్యాలయం ముందు బారులు..

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో ఆరంభమైన సుశాంత్ సింగ్ డెత్ కేసు మిస్టరీలోకి.. ప్రస్తుతం నార్కొటిక్ కంట్రోల్ బ్యురో అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఫలితంగా బాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు కొందరు ఎన్సీబీ అధికారుల కార్యాలయం ముందు బారులు తీరి నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాప్ హీరోయిన్లు దీపికా పడుకొణె, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం వారంతా ఎన్సీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

 దిశా సలియాన్ మరణంపైనా..

దిశా సలియాన్ మరణంపైనా..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసులో మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. సుశాంత్ సింగ్ వద్ద మేనేజర్‌గా పనిచేసిన దిశా సలియాన్ మృతి చెందిన ఉదంతంపైనా సీబీఐ కన్ను వేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దిశా సలియాన్ మృతిపైనా సీబీఐ దర్యాప్తు చేయాల్సి ఉందని, అప్పుడే ఈ కేసుకు సరైన ముగింపు లభిస్తుందని కేంద్ర సామాజిక, సాధికార శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే వెల్లడించారు. దిశా సలియాన్ మరణంపైనా సీబీఐ దర్యాప్తు చేయొచ్చునే సంకేతాలను ఆయన ఇచ్చారు.

బెడ్‌రూమ్‌లో టార్చర్..

బెడ్‌రూమ్‌లో టార్చర్..

జూన్ 8వ తేదీన దిశా సలియాన్ ఇంట్లో ఓ పార్టీని నిర్వహించారని, ఈ సందర్భంగా మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఆమె టార్చర్‌కు గురయ్యారనే సమాచారం ఉందని రామ్‌దాస్ అథవాలే చెప్పారు. సీబీఐ ఆమె మృతిపైనా దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియాన్ డెత్ కేసులకు ఓ సమగ్ర ముగింపు లభిస్తుందని చెప్పారు. దిశా సలియాన్ మృతి చెందిన ఘటనపై దర్యాప్తు చేపట్టకుండా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసులో ఓ కన్‌క్లూజన్‌కు రాలేమని తేల్చి చెప్పారు.

ధర్మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరెస్ట్

ధర్మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరెస్ట్

ఇదిలావుండగా.. ధర్మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ అరెస్టు అయ్యారు. డ్రగ్స్ కేసులో ఆయనను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ రాకెట్‌లో ఆరోపణలను ఎదుర్కొంటోన్న క్షితిజ్ రవిప్రసాద్ కొంతకాలంగా విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించారు ఎన్సీబీ అధికారులు. డ్రగ్స్ రాకెట్‌లో రవిప్రసాద్ ప్రమేయం ఉండటంతో ఆయనను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నారు.

English summary
Union Minister Ramdas Athawale told that CBI should investigate Disha Salian death as well and come to a conclusion soon.We need to end this menace of drugs and curb its smuggling, NCB should probe it, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X