విద్యార్థుల వీపు విమానం మోతే: సీబీఎస్ఈ పరీక్ష ఫీజుల వాత! రూ.50 నుంచి రూ.1200కు పెంపు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్టు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్ష ఫీజుల ఫీజును అసాధారణంగా పెంచేసింది. విద్యార్థుల వీపు విమానం మోత మోగించింది. ఇదివరకు ఉన్న ఫీజుల మొత్తాన్ని 24 రెట్లు పెంచింది. ఫలితంగా- ప్రస్తుతం 50 రూపాయలుగా ఉన్న ఫీజు మొత్తం తాజా పెంపుతో 1200 రూపాయలకు చేరింది. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తాజా పెంపు వర్తిస్తుంది. అవే తరగతుల్లో చదివే సాధారణ కేటగిరి విద్యార్థుల విద్యార్థుల ఫీజును కూడా పెంచినప్పటికీ.. ఆ స్థాయిలో లేదు. సాధారణ కేటగిరీ విద్యార్థుల పరీక్ష ఫీజు 750 నుంచి 1500 రూపాయలకు పెంచారు.
దీనితో పాటు వారి ఫీజుల చెల్లింపులపై కొత్తగా ఆంక్షలను విధించారు. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులు తత్సంబంధిత పరీక్షా ఫీజును తొమ్మిదో తరగతిలోనే చెల్లించాల్సి ఉంటుంది. తన పేరును రిజిస్ట్రర్ చేయించుకోవాల్సి ఉంటుందని సీబీఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే- ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రాయబోయే విద్యార్థులు తమ పేరును మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాత ఫీజులకు అనుగుణంగా విద్యార్థుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన విద్యాసంస్థలు తాజాగా మిగిలిన మొత్తాన్ని విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవాలని సూచించింది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications