ఛీ..ఛీ.. వీడు మొగుడేనా: సీసీ కెమెరాలు ఎక్కడ ఫిక్స్ చేశాడంటే...!
ఒకప్పుడు ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే నిందితులను గుర్తించి పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. సాంకేతికత పెరిగిన తర్వాత ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా... ఇట్టే పట్టేసుకోవడం జరుగుతోంది. అయితే నేరస్తులను పట్టుకుంటున్నది పోలీసులే అయినా.. వారిని గుర్తించడంలో మాత్రం సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన సీసీ కెమెరాలు ఇప్పుడు గ్రామాల్లో కూడా దర్శనమిస్తున్నాయి. కొందరైతే ఇంటి వద్ద కూడా భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ కూడా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఇళ్లంతా సీసీ కెమెరాలే బిగించాడు. ఇళ్లంతా అంటే బెడ్రూమ్‌తో సహా ఫిక్స్ చేశాడు.

పడకగదిలో సీసీ కెమెరాలు
త్రిపురలోని వెస్ట్ త్రిపురా జిల్లా సాధుతిల్లా గ్రామంలో రత్న పొడ్డార్ చందన కాంతి ధార్ దంపతులు నివాసం ఉంటున్నారు. తన ఇంటి భద్రతను దృష్టిలో ఉంచుకుని కాంతి ధార్ ఇంటి చుట్టూ లోపల సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఇంటిలోపల అంటే తమ పడకగదిలో కూడా సీసీ కెమెరాలను అమర్చడంతో భార్య రత్న పొడ్డార్ చాలా ఇబ్బందికి గురైంది. తీసేయాలని చెప్పినప్పటికీ ఆ ధార్ మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో ఆ పొడ్డార్ త్రిపుర రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఫిర్యాదు చేసింది. అంతేకాదు తమకు పెళ్లి జరిగి మూడేళ్లు అవుతోందని ఇప్పటికీ కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు, మరిది ఇతర బంధువులు ఆమెను మానసికంగా, భౌతికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

వేధింపులు తాళలేక పుట్టింటికి చేరుకున్న మహిళ
ఇక ఓ చిన్న స్థలాన్ని అమ్మి తన తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయలు ఇచ్చారని అయినప్పటికీ వేధింపులు ఆపలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తాను తన బంధువుల అమ్మాయితో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడని పొడ్డార్ తన ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులకు తోడు తమ పడకగదిలో కూడా సీసీ కెమరాలు అమర్చారని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో కాంతిధార్ సీసీటీవీ కెమెరాలు బిగించగా ఇక అదే ఏడాది డిసెంబరు నుంచి పొడ్డార్ తన తల్లిదండ్రులతో ఉంటోంది. ఇక టీవీలను తన అత్తగారి పడకగదిలో బిగించాడని వెల్లడించింది. తను మహిళనని చెప్పిన పొడ్డార్... బట్టలు మార్చుకునే సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పింది.

అమాయకుడని వాదించిన భర్త
ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్ భర్తపై గృహహింస కింద కేసు నమోదు చేయడంతో పాటు వరకట్న వేధింపులు కేసు కూడా నమోదు చేసింది. అయితే కాంతిధార్ మాత్రం పొడ్డార్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. తను అమయాకుడినని తనకు మరో మహిళతో సంబంధాలు లేవని చెప్పాడు. కేవలం ఆత్మరక్షణ కోసమే ఇంటి లోపలా బయటా సీసీ కెమెరాలను బిగించినట్లు చెప్పాడు. అయితే తను మరో గదిలో పడుకుంటున్నట్లు చెప్పిన కాంతిధార్... తన సేఫ్టీని కవర్ చేసేలానే సీసీ కెమెరాలు ఫిక్స్ చేసినట్లు చెప్పాడు. ఇదిలా ఉంటే ఓ మహిళ వ్యక్తిగత జీవితంను పర్యవేక్షణలో ఉంచడం చాలా సీరియస్ నేరమని పేర్కొన్న త్రిపుర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ బర్నాలీ గోస్వామి... ఇద్దరికి 45 రోజుల సమయం ఇచ్చి ఒక అవగాహనకు రావాలని చెప్పినట్లు వెల్లడించారు. అప్పటివరకు మెయిన్‌టెనెన్స్ కింద రూ.3వేలు రత్న పొడ్డార్‌కు చెల్లించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications