ఖతర్నాక్ లేడీస్ : క్యాష్ కౌంటర్ ఖాళీ చేశారు
ముంబై: పిల్లలను వెంట పెట్టుకుని హోటల్ కు వెళ్లిన ముగ్గురు మహిళలు అక్కడ ఉన్న సిబ్బంది కళ్లు గప్పి క్యాష్ కౌంటర్ ఖాళీ చేసిన ఘటన నవీ ముంబైలో జరిగింది. అక్కడ ఉన్న వారిని బురిడీ కొట్టించినా చివరికి పోలీసులకు చిక్కిపోయి కటకటాలపాలైనారు. నవీ ముంబైలో గత వారం ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవీ ముంబైలోని ప్రసిద్ధి చెందిన ఓ హోటల్ కు ముగ్గురు మహిళలు వెళ్లారు. వారి వెంట ఇద్దరు బాలికలు ఉన్నారు. తరువాత క్యాష్ కౌంటర్ దగ్గర సిబ్బందిని మాటల్లో దించారు. క్యాష్ కౌంటర్ బయటకు కనపడకుండా నీలం రంగు దుప్పటాను పెట్టారు.

ఓ బాలిక క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లి అందులో ఉన్న మొత్తం నగదు లూటీ చేసింది. తరువాత ముగ్గురు మహిళలు బాలికలను పిలుచుకుని అక్కడి నుంచి జారుకున్నారు. తరువాత క్యాష్ కౌంటర్ లోని రూ. 20, 500 రూపాయలు చోరీ అయ్యిందని హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. హోటల్ సిబ్బందిని విచారించారు. సీసీ కెమెరాల్లోని క్లిప్పింగ్స్ పరిశీలించి ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. చోరీకి సహకరించిన ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకుని జువనైల్ హోమ్ కు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications