i20..మధ్యాహ్నమే పార్కింగ్.. CCTV ఫుటేజీలో..!!

ఢిల్లీలోని చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పేలుడులో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉంటోంది. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.

గుజరాత్ లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పేలుడు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తర్వాత ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థంతో కూడుకుని ఉన్న ప్రదేశాలు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా పెంచారు. రాత్రంతా పోలీసులు పహారా చేపట్టారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం వదిలిపెట్టారు.

CCTV Footage Unveils Suspect Hyundai i20 Changed 4 Owners

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. ఈ పేలుడు కోసం ఉపయోగించిన హ్యుందాయ్ i20 నంబర్ HR 26 CE 7674కారుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కారు 2014 నుండి నాలుగు సార్లు చేతులు మారింది. దీనికి సంబంధించిన ఏ ఒక్క రికార్డు కూడా నమోదు కాలేదని దర్యాప్తులో తేలింది. తొలుత సల్మాన్ అనే వ్యక్తి ఈ కారును 2014 మార్చి 18న కొనుగోలు చేశారు. ఆ తర్వాత దేవేంద్ర, సోనూ దీన్ని కొన్ారు. చివరిగా తారిఖ్‌ పేరు మీద ఇది రిజిస్టర్ అయింది. ఇవేవీ రికార్డుల్లో లేవు.

ఫరీదాబాద్‌కు చెందిన ఓ కార్ డీలర్ కూడా ఈ విక్రయంలో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కారు సెప్టెంబర్ 20న ఫరీదాబాద్‌లో కనిపించింది. పార్కింగ్ కు సంబంధించిన ఓ చలాన్ కూడా పెండింగ్‌లో ఉంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ కారు మొదటిసారి కనిపించింది. తర్వాత నార్త్ ఢిల్లీలోని కాశ్మీర్ గేట్, దరియాగంజ్, సున్హేరి మసీదు, రెడ్‌ఫోర్ట్‌తో సహా పలు కీలక ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలలో ఇది రికార్డ్ అయ్యింది.

ఒకరిని దింపడానికి ఈ కారు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ నుంచి సేకరించిన రెండు స్క్రీన్‌గ్రాబ్‌లు కారు డ్రైవర్ ముఖాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ కారు పేలుడు సంభవించడానికి మూడు గంటల ముందు అంటే మధ్యాహ్నం 3.19 నిమిషాల రెడ్ ఫోర్ట్ వద్ద పార్కింగ్ చేసినట్లు సమాచారం. సాయంత్రం 6.48 గంటల వరకు పార్కింగ్ లోనే ఉందని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

కారు కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రాథమిక విచారణ ఆధారంగా.. కొత్వాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు, కుట్ర, పేలుడు పదార్థాల నిర్వహణ, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే నేరాలకు సంబంధించిన యూఏపీఏలోని సెక్షన్లు 16, 18, ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌లోని సెక్షన్లు 3, 4, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 103(1), 109(1), 61(2) కింద ఈ కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+