CD girl: మాజీ మంత్రి రాసలీలల కేసు, పీజీ లేడీ తండ్రి పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, స్టేట్ మెంట్ తో !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జరాకిహోళి, సీడీ గర్ల్ రాసలీలల కేసు మరో మలుపు తిరిగింది. తన కుమార్తె ఇచ్చిన స్టేట్ మెంట్ ను పరిగణలోకి తీసుకుని విచారణ చెయ్యకూడదని ఆ అమ్మాయి తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి రమేష్ జరాకిహోళి రాసలీలల సీడీలో ఉన్న బెంగళూరు పీజీ గర్ల్ తండ్రి వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఆ అమ్మాయి న్యాయమూర్తి ముందు ఏం జరిగింది అనే విషయంపై స్టేట్ మెంట్ ఇచ్చింది.

పీజీ లేడీ రాసలీలల ఎఫెక్ట్
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జరాకిహోళి, బెంగళూరులోని ఆర్ టీ నగర్ లోని పీజీ సుందరి రాసలీలల సీడీ లీక్ కావడంతో ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. రాసలీలల సీడీ పుణ్యమా అంటూ రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ వ్యవహారం బీజేపీ నాయకులకు తలనొప్పిగా మారింది.

మాయం అయిన పీజీ సుందరి
రాసలీలల సీడీ విడుదలైన తరువాత పీజీ లేడీ మాయం అయ్యింది. సీడీ లేడీ వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రం తిప్పారని మాజీ మంత్రి రమేష్ జరాకిహోళితో పాటు అనేక మంది బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో సీడీ లేడీ ఆమె న్యాయవాది సహకారంతో మాజీ మంత్రి రమేష్ జరాకిహోళి మీద బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు పెట్టడం కలకలం రేపింది.

న్యాయమూర్తి ముందు స్టేట్ మెంట్
ఇదే ఏడాది మార్చి 30వ తేదీన బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు ప్రత్యక్షం అయిన పీజీ లేడీ మాజీ మంత్రి రమేష్ జరాకిహోళికి విరుద్దంగా స్టేట్ మెంట్ ఇచ్చింది. న్యాయమూర్తి ముందు యువతి స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత సిట్ అధికారులు రాసలీలల సీడీ కేసు విచారణ ముమ్మరం చేశారు.

హైకోర్టులో యువతి తండ్రి పిటిషన్
న్యాయమూర్తి ముందు యువతి స్టేట్ మెంట్ ఇచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీ న్యాయవిభాగం శాఖ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది సూర్య ముకుందరాజ్ కూడా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో తన కుమార్తె తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చిందని, ఆ స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ చెయ్యకూడదని మనవి చేస్తూ బాధితురాలి తండ్రి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Recommended Video

పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
తన మీద ఒత్తిడి చేసి ఎవ్వరూ కోర్టు ముందు స్టేట్ మెంట్ ఇప్పించలేదని, తాను ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్ మెంట్ కు కట్టుబడి ఉన్నానని సీడీ గర్ల్ స్పష్టం చేసింది. బాధితురాలిని ప్రశ్నించే హక్కు ఆమె తండ్రికి లేదని న్యాయవాది కోర్టులో చెప్పారు. బాధితురాలి తండ్రి సమర్పించిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ కొట్టివేయడంతో ఇప్పుడు కేసు విచారణ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలని సామాన్య ప్రజలు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications