వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CDS Bipin Rawat: చాపర్ ప్రమాద స్థలి నుంచి బ్లాక్ బాక్స్ స్వాధీనం.. ఇందులో ఏముంది..?

|
Google Oneindia TeluguNews

తమిళనాడు కూనూరులో జరిగిన ఘోర హెలికాఫ్టర్ దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్‌తో సహా ఆయన భార్య మరో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే హెలికాఫ్టర్ కూలడానికి కారణాలు స్పష్టంగా లేదా అధికారికంగా ఇంకా తెలియరాలేదు. హెలికాఫ్టర్ కూలడానికి కారణం అక్కడ నెలకొన్న వాతావరణమే అని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం లోతైన దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అధికారులు ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బ్లాక్ బాక్స్ స్వాధీనం


తమిళనాడు కూనూరులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంకు సంబంధించి బ్లాక్‌బాక్స్‌ను వైమానికదల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. హెలికాఫ్టర్ ప్రమాదంకు సంబంధించిన దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకంగా వ్యవహరించనుంది. ప్రమాదానికి ముందు హెలికాఫ్టర్‌లో ఎలాంటి వాతావరణం చోటుచేసుకుంది, పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఏమైనా సూచనలు చేశారా మిగతా వాళ్లు ఏం మాట్లాడారు అనే అంశాలు బయటకు వస్తాయి. దీంతో దర్యాప్తు అధికారులు ప్రమాదం ఎలా జరిగిందనే అంచనాకు వచ్చేందుకు బ్లాక్ బాక్స్ కీలకంగా మారనుంది.

 బ్లాక్ బాక్స్ అంటే ఏంటి

బ్లాక్ బాక్స్ అంటే ఏంటి


బ్లాక్ బాక్స్ విచారణలో కీలకంగా మారుతుంది. బ్లాక్ బాక్స్‌లో పైలెట్లు ఇతరుల సంభాషణలు రికార్డ్ అవుతాయి. బ్లాక్ బాక్స్ నారింజ (Orange) రంగులో ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం చాపర్ దగ్ధమైనా.. బ్లాక్ బాక్స్‌ను రంగు ఆధారంగా గుర్తుపట్టేందుకు నారింజ కలర్‌తో డిజైన్ చేస్తారు. ఇది ప్రతికూల వాతావరణంలో కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఒకవేళ క్రాష్ మరింత డేంజరస్‌గా ఉన్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం ధ్వంసం అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు చాలా విమాన ప్రమాదాల్లో కానీ, హెలికాఫ్టర్ ప్రమాదాల్లో కానీ సగం కేసులను బ్లాక్‌ బాక్సులే పరిష్కరించాయని నిపుణులు చెబుతున్నారు.

అసలు ఏం జరిగింది

అసలు ఏం జరిగింది

ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం తమిళనాడుకు ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరారు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్. ఆయనతో పాటు ఆయన సతీమణి మధులిక కూడా ఉన్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో సూలూరు ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి Mi-17చాపర్‌లో బయలుదేరారు. వారంతా వెల్లింగ్టన్‌కు వెళ్లాల్సి ఉంది. వెల్లింగ్టన్ మిలటరీ కాలేజీలో సీడీఎస్ బిపిన్ రావత్ మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రత్యేక లెక్చర్ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం చాపర్‌లో సూలూరు బేస్ నుంచి బయలుదేరారు. బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 14 మంది ఈ చాపర్‌లో ప్రయాణించారు. చాపర్ కూనూరుకు చేరుకోగానే దట్టమైన మబ్బులు లేదా పొగమంచు ఆ సమయానికి ఉన్నింది. ఇక్కడే చాపర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైంది. చాపర్ ప్రమాదానికి ప్రతికూల వాతవరణమే కారణమని అక్కడి స్థానికులు చెప్పారు. ప్రమాద స్థలికి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది.

Recommended Video

IAF Mi 17 V5 : Russian Made Chopper Facts Explained || Oneindia Telugu

ప్రముఖులు నివాళులు

ఇదిలా ఉంటే వెల్లింగ్టన్‌లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మృతి చెందిన మిగతావారి పార్థీవదేహాలకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మధ్యాహ్నం సూలూరు బేస్‌ క్యాంపునకు జనరల్ బిపిన్ రావత్ దంపతుల భౌతిక కాయాన్ని తరలించి అక్కడి నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలిస్తారు. శుక్రవారం రోజున జనరల్ బిపిన్ రావత్ అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో జరుగుతాయి.

English summary
Airforce team have recovered the black box of the chopper that crashed yesterday in Tamilnadus Coonoor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X