వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీడీఎస్ బిపిన్ రావత్: విమానం,హెలీకాప్టర్‌లలో ప్రయాణించే ముందు ఆర్మీ అధికారులు పాటించాల్సిన 7 నిబంధనలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
Mi-17V5 మోడల్ హెలీకాప్టర్‌

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13మంది చనిపోయారని ఆర్మీ ప్రకటించింది.

ప్రమాదం జరిగినప్పుడు బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నది Mi-17V5 మోడల్ హెలీకాప్టర్‌లో. రష్యాలో తయారైన ఈ హెలికాప్టర్లను సైనిక రవాణా కోసం ఉపయోగిస్తారు.

భారతదేశంలో వీఐపీల కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2014లో 'ఎయిర్ సేఫ్టీ' సర్క్యులర్‌ను జారీ చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా చిన్న విమానాలు, హెలీకాప్టర్లలో ప్రయాణించే వీఐపీలు ఈ సేఫ్టీ నిబంధనలను తప్పకుండా పాటించాలి.

ఎన్నికల సమయంలో నాయకులు, వీఐపీలు చిన్న విమానాలు, హెలీకాప్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నందున ఈ జాగ్రత్తలు ప్రకటించారు.

ఆర్మీ అధికారులు ప్రయాణించే విమానాలు, హెలీకాప్టర్లకు ప్రత్యేక భద్రతా నియమాలు ఉంటాయి.

వీఐపీ ప్రయాణ భద్రతా నియమాలు

  • పైలట్‌ కు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి
  • హెలిప్యాడ్ ఎంపిక సరిగ్గా ఉండాలి.
  • హెలికాప్టర్ దిగేందుకు అనువైన స్థలం ఉండాలి.
  • విమానం, హెలీకాప్టర్‌ సిబ్బందికి సరైన ప్రయాణ సమాచారం ఉండాలి. చెట్లు, హైటెన్షన్ వైర్లు, హెలిప్యాడ్‌లను సరిగ్గా తనిఖీ చేసుకోవాలి.
  • విమానం,హెలీకాప్టర్‌ ప్రయాణించే మార్గం, ప్రయాణీకుల సంఖ్య గురించి సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ (ATC)కి తెలియజేయాలి.
  • ప్రయాణానికి ముందు వాతావరణం గురించి తెలుసుకోవాలి.
  • విమానం లేదా హెలీకాప్టర్‌ ఎక్కే ముందు వైద్య పరీక్ష తప్పనిసరి.
  • ఫ్లైట్‌ సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు లేదా సరుకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో సేఫ్టీ నియమాలను పాటించాలి.

సీనియర్ ఆర్మీ అధికారులకు హెలికాప్టర్ ప్రయాణ నియమాలు

  • జనరల్ స్థాయి అధికారులు ఇద్దరు కంటే ఎక్కువ కలిసి ప్రయాణించకూడదు.
  • ప్రయాణానికి రెండు ఇంజిన్లు ఉన్న హెలికాప్టర్‌ను వాడాలి.
  • భద్రతా తనిఖీలు చాలా ముఖ్యమైనవి.
  • నిర్ణీత సమయాల్లో ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఈ సమయంలో మార్పు చేయడం వీలు కాదు.
  • వాతావరణం ఆ నెల పై ఆధారపడి ఉంటుంది.
  • ఇది ల్యాండింగ్ లేదా టేకాఫ్ అయ్యే ప్రదేశంలో తగినంత ఇంధనం ఉండాలి.
  • ఎమర్జెన్సీ అంబులెన్స్, వైద్య సహాయం అందుబాటులో ఉండాలి.

"సీనియర్‌ ఆర్మీ అధికారులు ప్రయాణించబోయే హెలీకాప్టర్‌ బాగోగులు, టెక్నాలజీ తోపాటు పైలట్ల అనుభవం, వారి ట్రైనింగ్‌ ఎక్కడలాంటి కీలకమైన అంశాలను పరిశీలిస్తారు" అని ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) భూషణ్ గోఖలే బీబీసీ తో అన్నారు.

విమానం లేదా హెలీకాప్టర్‌ బరువెంత అన్నదానిపై స్పష్టమైన నియమాలున్నాయని భూషణ్‌ గోఖలే తెలిపారు.

సీనియర్ ఆర్మీ అధికారులు రాత్రిపూట ప్రయాణం చేయకూడదనే నిబంధన ఉంది. అంతేకాకుండా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను ప్రయాణిస్తున్న వారికి తెలియజేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
CDS Bipin Rawat: What are the 7 rules that Army officers have to follow before traveling in airplanes and helicopters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X