Chopper crash: బిపిన్ రావత్‌తో సహా 13 మంది మృతి పట్ల పార్లమెంట్ నివాళి: రాజ్‌నాథ్ ప్రకటన
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ ఉభయ సభల్లో గురువారం నాడు ప్రకటన చేశారు.
గురువారం నాడు పార్లమెంట్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢమైన దుఃఖంతో మరియు బరువెక్కిన హృదయంతో, 2021 డిసెంబర్ 8 మధ్యాహ్నం సైనిక హెలికాప్టర్ కూలిపోయిందనే దురదృష్టకర వార్తను తెలియజేస్తున్నాను అని వెల్లడించారు.

హెలికాఫ్టర్ ప్రమాద ఘటన పై పార్లమెంట్ లో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్
జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజ్ లో సంభాషించడానికి విల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి వెళ్ళవలసి ఉందన్నారు . ఎయిర్ ఫోర్స్ Mi-17V5 హెలికాప్టర్ నిన్న ఉదయం 11:48 గంటలకు సూలూర్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరి, మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్‌టన్‌లో ల్యాండ్ అవుతుందని, అందులో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆ హెలికాప్టర్ లో ఉన్నారని పేర్కొన్నారు. కానీ
ఎయిర్ ఫోర్స్ Mi 17 V 5 హెలికాప్టర్ నిన్న ఉదయం 11:48 గంటలకు సూలూర్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరింది. కానీ సూలూరు ఎయిర్‌బేస్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు దాదాపు మధ్యాహ్నం 12:08 గంటలకు హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయని వెల్లడించారు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో 13 మంది మరణించారని వెల్లడి
అనంతరం కొంతమంది స్థానికులు కూనూర్ సమీపంలోని అడవిలో మంటలను గుర్తించి అక్కడకు వెళ్లారని, మంటల్లో మిలిటరీ హెలికాప్టర్ శకలాలు గమనించారని ఆయన స్పష్టం చేశారు. చుట్టుపక్కల స్థానిక యంత్రాంగం నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన ప్రదేశంలో హెలికాఫ్టర్ శిథిలాలలో చిక్కుకున్న వారిని విల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.
దురదృష్టకర హెలికాప్టర్‌లోని మొత్తం 14 మందిలో 13 మంది గాయాలతో మరణించినట్లు తాజా నివేదికలు ధృవీకరించాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
మరణించిన వారిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య శ్రీమతి మధులికా రావత్
మృతుల్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య శ్రీమతి మధులికా రావత్, అతని రక్షణ సలహాదారు బ్రిగ్ లఖ్‌బిందర్ సింగ్ లిద్దర్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ మరియు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు. వారి పేర్లు వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ అరక్కల్ ప్రదీప్, హవల్దార్ సత్పాల్ రాయ్, నాయక్ గుర్ సేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ మరణించారని ధృవీకరించారు.
ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలు కాపాడే ప్రయత్నం, విచారణకు ఆదేశం
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ విల్లింగ్టన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో లైఫ్ సపోర్ట్‌లో ఉన్నాడు. అతని ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు.
తమిళనాడులో ఐఏఎఫ్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనలో మిలటరీ హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం (IAF) ట్రై-సర్వీస్ విచారణకు ఆదేశించింది. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది. విచారణ బృందం బుధవారం విల్లింగ్‌టన్‌కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు.
సైనిక గౌరవాలతో అంతిమ సంస్కారం .. పార్లమెంట్ లో మృతులకు నివాళి
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పూర్తి సైనిక గౌరవాలతో బిపిన్ రావత్, ఆయన సతీమణి అంత్యక్రియలు పూర్తి చేస్తారని తెలిపారు. తాను పార్లమెంటు ఉభయ సభల తరపున హెలికాఫ్టర్ కూలిపోయిన దుర్ఘటనలో మరణించిన వారందరికీ నివాళులర్పిస్తున్నామని, మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Recommended Video
బిపిన్ రావత్ తోపాటు మృతుల అందరికీ చట్ట సభల సంతాపం
తమిళనాడులో జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాద దుర్ఘటనలో భారత తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోవడం పై చట్ట సభలు సంతాపం ప్రకటించాయి .ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి బాధాతప్త హృదయాలతో చట్టసభల సభ్యులందరూ అంజలి ఘటించారు. చనిపోయిన వారి పార్ధివదేహాలను గురువారం సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications