మహారాష్ట్ర, జార్ఖండ్ లో మోగిన ఎన్నికల నగారా.. ! ముఖ్యమైన తేదీలివే..

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్: మహారాష్ట్ర, జార్ఖండ్ లో అసెంబ్లీలకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల్ని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని ఇతర కమిషనర్లతో కలిసి ఆయన ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో 288 అసెంబ్లీ సీట్లు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 9.63 కోట్ల ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. 20 లక్షల మంది తొలిసారి ఓటు వేసే వాళ్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే లక్షా 186 పోలింగ్ స్టేషన్లలో ఈసారి పోలింగ్ జరగబోతోందన్నారు. మహిళల కోసం ప్రత్యేక బూత్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జార్ఖండ్ లో 24 జిల్లాల్లో 81 సీట్లు ఉన్నాయని సీఈసీ తెలిపారు. 2025 లో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగుస్తుందన్నారు. 2.6 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారని వెల్లడించారు. 11.84 లక్షల మంది తొలిసారి ఓటర్లు ఉన్నారన్నారు. 1706 మంది వందేళ్లు దాటిన ఓటర్లు కూడా ఉన్నారన్నారు. 29562 పోలింగ్ స్టేషన్లలో ఈసారి పోలింగ్ జరగనుందన్నారు.

cec announced schedule for maharastra Jharkhand assembly elections- here are important dates

ఈసారి ఎన్నికల్లో పోలింగ్ బూత్ లలో ఓటరు క్యూలో ఉన్నప్పుడు పక్కనే కూర్చొనేలా కుర్చీలు కూడా వేయించబోతున్నట్లు సీఈసీ తెలిపారు. 85 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే దివ్యాంగులకు కూడా ఇంటి వద్ద నుంచే ఓటింగ్ వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటరు హెల్ప్ లైన్ యాప్ తో పాటు ఫిర్యాదుల కోసం కూడా సీవిజిల్ యాప్ కూడా వాడుతున్నట్లు తెలిపారు.

మహారాష్ట్రలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఈసీ ప్రకటించారు. అక్టోబర్ 22న నోటిఫికేషన్ ఇస్తామని, నవంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తామని, నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మహారాష్ట్రలో గతంలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతాలు తక్కువగా ఉన్న పలు నియోజకవర్గాలపై ఈసారి గట్టిగా ఫోకస్ పెడుతున్నట్లు సీఈసీ వెల్లడించారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లు కూడా భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలన్నారు.

అలాగే జార్ఖండ్ లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఈ నెల 18న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. అలాగే తొలిదశ ఎన్నికలు నవంబర్ 13న ఉంటాయన్నారు. అలాగే రెండో దశ నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల చేస్తామని, రెండో దశ పోలింగ్ నవంబర్ 20న ఉంటుందన్నారు. ఫలితాలను మహారాష్ట్ర ఎన్నికలతో కలిపి వచ్చే నెల 23న విడుదల చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+