శుభవార్త:రూ. 20లక్షల వరకు గ్రాట్యూటీపై నో ట్యాక్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రాట్యూటీ చెల్లింపు సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గత వారమే లోక్‌సభ ఆమోదించింది. గురువారం నాడు ఈ బిల్లకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు సాగుతున్నాయి. అయినా ప్రభుత్వం ఈ బిల్లులను పాస్ చేయించుకొంది. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో గురువారంనాడు ఈ బిల్లును ఆమోదం లభించింది. విపక్ష పార్టీల ఎంపీల నిరసనల మధ్యే ఈ బిల్లుకు ఆమోదం లభించింది. కేంద్ర కార్మిక శఆఖ మంత్రి సంతోష్ కుమార్ మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లును ఆమోదింపజేశారు.

పన్ను రహిత గ్రాట్యూటీ ప్రస్తుతమున్న రూ. 10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెరుగుతోంది. దీనికి తోడు 12 వారాల ప్రసూతి సెలవులకు బదులుగా ఎప్పటికప్పుడు కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేయడం ద్వారా వీటిని పెంచుకొనే హక్కును ప్రభుత్వానికి కల్పించింది.7వ, వేతన సంఘ అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యూటీ మొత్తం రూ. 20 లక్షలకు పెరిగింది.












Click it and Unblock the Notifications