Youtube: తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 8 యూట్యూబ్ ఛానళ్లను బస్ట్ చేసిన కేంద్రం..
పలు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరఢా ఝలిపించింది. ముందస్తు లోక్ సభ ఎన్నికల ప్రకటన, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను పోస్ట్ చేసినందకు ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లపై చర్య తీసుకుంది. ఆ యూట్యూబ్ ఛానళ్లను బస్ట్ చేసినట్లు ప్రకటించింది.
యహాన్ సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కెపిఎస్ న్యూస్, సర్కారీ వ్లాగ్, ఎర్న్ టెక్ ఇండియా, ఎస్‌పిఎన్ 9 న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్, వరల్డ్ బెస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేసినందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వాస్తవ తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. .
వరల్డ్ బెస్ట్ న్యూస్, 1.7 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా.. 18 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానెల్ భారత సైన్యాన్ని తప్పుగా సూచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 3.43 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు, 23 కోట్ల వ్యూస్ కలిగిన ఎడ్యుకేషనల్ దోస్త్ అనే ఛానెల్ ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని కేంద్రం పేర్కొంది. 4.8 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు, 189 కోట్ల వ్యూస్ తో ఉన్న SPN9 రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

4.5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు, 9.4 కోట్ల వ్యూస్ ఉన్న సర్కారీ వ్లాగ్ ఛానెల్ ప్రభుత్వ పథకాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 13 కోట్ల వ్యూస్ ఉన్న 'కేపీఎస్ న్యూస్' అనే ఛానెల్‌లో రూ.20కి వంటగ్యాస్ సిలిండర్లు, లీటరుకు రూ.15కు పెట్రోలు లభిస్తాయంటూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఆర్డర్లు, నిర్ణయాలకు సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని వారు తెలిపారు.
3.5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు, 160 కోట్ల వ్యూస్ కలిగిన 'క్యాపిటల్ టీవీ' అనే ఛానెల్ కూడా ప్రధాని, ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన అమలుకు సంబంధించిన ఉత్తర్వుల గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని గుర్తించారు. 3 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు, 100 మిలియన్లకు వ్యూస్ ఉన్న 'యహన్ సచ్ దేఖో' యూట్యూబ్ ఛానెల్ ఎన్నికల సంఘం మరియు భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేసిందన్నారు. 31,000 మంది సబ్‌స్క్రైబర్లు, 3.6 మిలియన్ల వీక్షణలతో 'ఎర్న్ ఇండియా టెక్' ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతరులకు సంబంధించిన నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications