ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ల బుకింగ్ పై కేంద్రం కీలకనిర్ణయం.. ధరలు ప్రియం!
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ వినియోగ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ రీఫిల్ బుకింగ్లో మధ్య ఉన్న కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఆందోళన
ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ కారణంగా గ్యాస్ కొరత ఏర్పడవచ్చు అన్న అనుమానంతో వినియోగదారులు ముందస్తుగా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న వేళ కేంద్రం ఈ మార్పు దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల పైన ఇరాన్ దాడులు, హార్ముజ్ జల సంధిని మూసివేసిన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతాయని, గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు.

హార్ముజ్ జలసంధి మూసివేతతో భయం
ఈ క్రమంలో హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా తీవ్రంగా ప్రభావితం కావచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా, ఇజ్రాయిల్, యూరప్, పాశ్చాత్య మిత్ర దేశాల నౌకలకు మాత్రమే జలసంధిని మూసివేస్తామని వెల్లడించింది. హార్ముజ్ జల సంధిని మూసివేసిన పరిస్థితులతో భారతదేశంలో కూడా గ్యాస్ కొరత ఏర్పడవచ్చని, చమురు ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం అయింది.
గ్యాస్ బుకింగ్ కనీస గడువు పెంపు
ఈ క్రమంలో భారత్లో చమురు నిల్వలు తగినంత ఉన్నాయని, ఎటువంటి కొరత ఏర్పడదని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ గృహ గ్యాస్ వినియోగదారులు, గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న అనుమానంతో గ్యాస్ సిలిండర్లను అధిక సంఖ్యలో బుక్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుదల
మరోవైపు ఒక్కొక్క సిలిండర్ పైన సుమారు 60రూపాయల వరకు ధరను ఎల్పిజి అధికం చేసింది. ఎల్పిజి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ఈ చర్యలు అవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మార్చి 7వ తేదీ నుంచి ఈ పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. మరోవైపు వాణిజ్య వినియోగదారుల కంటే, గృహ వినియోగదారుల అవసరాల మేరకు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చమురు మార్కెటింగ్ సంస్థలకు కేంద్రం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ ధరలు ఇలా
గ్యాస్ సరఫరా లో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని పేర్కొంది. ఇక ఇటీవల పెరిగిన ఎల్పిజి గ్యాస్ ధరల విషయానికి వస్తే 14.2 కిలోల గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లో గతంలో 905 రూపాయలు ఉంటే ఇప్పుడు 965 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 853 రూపాయల నుంచి 913 రూపాయలకు, ముంబైలో 852.50 పైసల నుంచి 912. 50 పైసలకు, కలకత్తాలో 879 రూపాయల నుంచి 930 రూపాయలకు, చెన్నైలో 868.50 పైసల నుంచి 928.50 పైసలకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.
-
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు. లీటర్ పై ఏకంగా... -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications