వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొదుపు ఖాతాల వడ్డీ రేట్ల తగ్గింపుపై కేంద్రం యూటర్న్‌ .. పాత రేట్లే యధాతధం .. రీజన్ ఇదేనా !!

|
Google Oneindia TeluguNews

అన్ని రకాల చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ నిన్న తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఈరోజు యూటర్న్ తీసుకుంది. ఈ రోజు నుండి అమల్లోకి రావాల్సిన చిన్న పొదుపు రేట్ల తగ్గింపును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించబడతాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం ఉదయం చెప్పారు.

 మోడీ సర్కార్ పేదల కోసం , అల్లుళ్ళ కోసం కాదు .. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్ మోడీ సర్కార్ పేదల కోసం , అల్లుళ్ళ కోసం కాదు .. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్

చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్రం .. 24 గంటల్లోనే యూటర్న్

చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్రం .. 24 గంటల్లోనే యూటర్న్

వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం బుధవారం 40-110 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన రేట్లు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చి జూన్ 30 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది .కానీ ప్రకటించిన 24 గంటల్లోనే యూటర్న్ తీసుకుంది . అనూహ్యంలో దేశంలో నాలుగు రాష్ట్రాలు , ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో భారత ప్రభుత్వం యొక్క చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు 2020-2021 చివరి త్రైమాసికంలో ఉన్న రేట్ల వద్ద కొనసాగుతాయని చెప్పి యూటర్న్ తీసుకుంది . నిన్న తీసుకున్న నిర్ణయం పొరబాటున తీసుకున్నామని చెప్పింది .

మార్చి 2021 నాటికి ఉన్న రేట్లు యధాతధంగా కొనసాగుతాయని నిర్మలా సీతారామన్ ట్వీట్

మార్చి 2021 నాటికి ఉన్న రేట్లు యధాతధంగా కొనసాగుతాయని నిర్మలా సీతారామన్ ట్వీట్

మార్చి 2021 నాటికి ఉన్న రేట్లు యధాతధంగా కొనసాగుతాయని, వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం ఉపసంహరించుకున్నామని ఉదయం 7.54 గంటలకు ట్వీట్‌లో నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నిర్ణయాన్ని తాము తొందరపడి తీసుకున్నామని చెప్పారు నిర్మలాసీతారామన్, అందుకే వీటిని అమలు చేయడం లేదని ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. . 2021-22 మొదటి త్రైమాసికంలో పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేటు 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సర్క్యులర్‌లో తెలిపింది.

వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నేపధ్యంలో ప్రతిపక్షాల విమర్శలే కారణం

వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నేపధ్యంలో ప్రతిపక్షాల విమర్శలే కారణం

వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం ప్రభుత్వానికి ఖర్చులను తగ్గించటానికి సహాయపడుతుంది, కాని పెట్టుబడిదారులను, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను మరియు మధ్యతరగతి ప్రజలను బాధించేదిగా ఉందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందనే విమర్శలు వ్యక్తం కావడం, అదేవిధంగా ఇదే సమయంలో నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్నికలు జరుగుతుండటం నేపథ్యంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.

English summary
The sharp reduction in small savings rates, which was to take effect from today, has been withdrawn by the government. Finance Minister Nirmala Sitharaman said Thursday morning that the “orders issued by oversight shall be withdrawn”. The government had on Wednesday cut interest rates on various small savings schemes sharply by 40-110 basis points. The revised rates were to come into effect from April 1 and remain in effect till June 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X