పరువు నష్టం: కేంద్ర మాజీ మంత్రికి జైలు శిక్ష
హుబ్బళి: విధాన పరిషత్ సభ్యుడు, ఓ కన్నడ దినపత్రిక యజమాని, వీఆర్ ఎల్ గ్రూప్స్ చెర్మేన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వేసిన పరువు నష్టం కేసులో కేంద్ర మాజీ మంత్రికి ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధించారు.
కర్ణాటకకు చెందిన బసనగౌడ పాటిల్ యత్నాళ్ శిక్షకు గురైనారు. అంతే కాకుండ రూ. 24 వేలు జరిమానా విధించారు. వీఆర్ ఎల్ గ్రూప్ కు అపరాద రుసం చెల్లించాలని, లేదంటే మరో నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలని హుబ్బళి రెండవ జేఎంఎఫ్ సీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

2004లో బసనగౌడ పాటిల్ యత్నాళ్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అయిన విజయ సంకేశ్వర పత్రికా రంగాన్ని అడ్డు పెట్టుకుని అధికార దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండ కేంద్ర మంత్రి అనంతకుమార్ సహాయంతో లబ్ది పోందుతున్నారని విమర్శించారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండ ప్రభుత్వం ఇచ్చే విమానం టిక్కెట్లు ఉపయోగించి ఆయన వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారని యత్నాళ్ ఆరోపించారు. విజయ సంకేశ్వర ఈ విషయంపై పరువు నష్టం దావా వేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేశారు.
సుమారు 11 సంవత్సరాల పాటు కేసు విచారణ జరిగింది. చివరికి కేంద్ర మాజీ మంత్రి యత్నాళ్ కు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. తనకు జామీను ఇవ్వాలని యత్నాళ్ కోర్టును ఆశ్రయించారు. తనుకు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చెయ్యాలని కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications