ఎల్ఐసీ ఛైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి నియామకం: ఎండీగా పాండే

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ(LIC) ఛైర్మన్‌గా సిద్దార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎల్ఐసీ ఛైర్మన్‌గా ఇప్పటి వరకు వ్యవహరించిన ఎంఆర్ కుమార్ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసిన నేపథ్యంలో మొహంతిని నియమిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం సిద్దార్థ మొహంతి ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, యాక్టింగ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో డైరెక్టర్ల నియామకాల బాధ్యత చూసే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్ బ్యూరో(FSIB) మొహంతి పేరును గత నెల కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నియామకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

Central Government appoints Siddhartha Mohanty as new LIC chairman

కాగా, ఎల్ఐసీ ఛైర్మన పదవీ కాలాన్ని 62 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్రం 2021లో లైప్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(స్టాఫ్) రెగ్యూలేషన్స్, 1960 చట్టానికి సవరణలు చేసింది. దీంతో మొహంతి 62 ఏళ్ల వయస్సు వరకు అంటే 2025 జూన్ 7 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

ఇక ఎల్ఐసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ పట్నాయక్‌ను ఐఆర్‌డీఏఐ(లైఫ్) మెంబర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ పట్నాయక్ కూడా 62 ఏళ్ల వయస్సు వరకు ఈ పోస్టులో కొనసాగనున్నారు. కాగా, ఐఆర్డీఏఐ బోర్డు స‌భ్యుడు (లైఫ్‌)గా నియ‌మితులైన బీసీ ప‌ట్నాయక్‌.. గ‌త నెల‌లో ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రిటైర్ అయ్యారు. ఆయ‌న స్థానంలో టాబ్లేష్ పాండే నియామకమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+