వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి సవాల్‌గా మారిన కరోనా వ్యాక్సిన్‌- అనుమతి, ధర, పంపిణీపై మల్లగుల్లాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌ 25న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ జయంతి సందర్భంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. భారత్‌లో అత్యవసర పరిస్దితుల్లో వ్యాక్సిన్‌ వాడకానికి తమకు అనుమతి ఇవ్వాలని మూడు సంస్ధలు కేంద్రాన్ని కోరుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ రాకపై జనంలోనూ ఆశలు పెరుగుతున్నాయి. అయితే వీటిలో ఎవరికి అనుమతి ఇవ్వాలి, ధర ఎంత నిర్ణయించాలి, వ్యాక్సిన్‌ కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, వీటి పంపిణీ సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంలో కేంద్రం తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

COVID 19 Vaccine: central government facing challenges
కరోనా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు..

కరోనా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు..

కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ కోసం కేంద్రం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. దేశీయ సంస్ధలైన భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ మరో వారం రోజుల్లో కొలిక్కి వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే డిసెంబర్‌ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది.

కేంద్రం ముందు వ్యాక్సిన్ సవాళ్లు...

కేంద్రం ముందు వ్యాక్సిన్ సవాళ్లు...

కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇదంత సులభం కాదనే వాస్తవం మాత్రం క్రమంగా అర్ధమవుతోంది. ముఖ్యంగా కేంద్రం కోరిన మేరకు ఆఘమేఘాల మీద వ్యాక్సిన్‌ తయారు చేసిన మూడు సంస్ధలు ఫైజర్, భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్ తమ వ్యాక్సిన్‌నే తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. తమ వ్యాక్సిన్‌ 70 శాతం సక్సెస్‌ అని ఒకరంటే మాది 90 శాతం సక్సెస్‌ అని మరొకరు చెబుతున్నారు. మా వ్యాక్సిన్‌ ధర 250 రూపాయలే అని ఒకరంటే అంతకంటే తక్కువకే ఇస్తామని మరొకరు చెబుతున్నారు. ఇలా వ్యాక్సిన్ తయారీ సంస్ధల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.

వ్యాక్సిన్‌కు ఊహించలేనంత డిమాండ్‌

వ్యాక్సిన్‌కు ఊహించలేనంత డిమాండ్‌

భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ ఇప్పటికే 9 సార్లు సమావేశమైంది. ఈ ప్రక్రియలో భాగస్వాములైన అందరితోనూ చర్చలు జరుపుతోంది. దేశంలో చేపట్టబోయే వ్యాక్సినేషన్‌ తొలి దశ ప్రక్రియకు భారీ డిమాండ్‌ ఉందని ఈ కమిటీ తేల్చింది. ఈ కమిటీ అంచనా ప్రకారం తొలిదశ వ్యాక్సినేషన్‌కే 70 నుంచి 80 కోట్ల డోసులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో ఒక్కో రోగికి రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రం అనుమతిస్తే కేవలం 4 కోట్ల డోసులు సరఫరా చేసేందుకు మాత్రమే సిద్దంగా ఉంది. మిగతా రెండు సంస్ధలు కూడా దాదాపు అదే స్ధాయిలో డోసులు సరఫరా చేయబోతున్నాయి. అంటే మూడు సంస్ధలు కలిపినా కేవలం 12 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. కానీ డిమాండ్‌ చూస్తే దాదాపు ఆరేడు రెట్లు అధికంగా ఉంది.

భిన్న ధరలకు వ్యాక్సిన్‌ కొనాల్సిందే...

భిన్న ధరలకు వ్యాక్సిన్‌ కొనాల్సిందే...

ప్రస్తుతం భారత్‌లో వ్యాక్సిన్ సరఫరాకు సిద్దమవుతున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌, ఫైజర్, భారత్‌ బయోటెక్‌ విభిన్న ధరల్లో దాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీకి అయిన ఖర్చు ఆధారంగా ఆయా సంస్ధలు ధరలు నిర్ణయిస్తున్నాయి. కానీ భారత్‌లో ఊన్న నిబంధనల ప్రకారం తక్కువ ధరను కోట్‌ చేసిన కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూస్తే ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్న మూడు కంపెనీల్లో ఏదో ఒక కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వాలి. లేదా నిబంధనలను సవరించి ముగ్గురి నుంచి వేర్వేరు ధరలకు తీసుకోవాలి. అలా తీసుకున్నా ఆరోపణలు తప్పవు. అలా ముగ్గురి నుంచి తీసుకున్నా వ్యాక్సిన్‌ డోసులు డిమాండ్‌కు తగ్గట్టుగా లేవు. దీంతో కేంద్రం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది.

కేంద్ర-రాష్ట్రాల వాటా ఎంతెంత ?

కేంద్ర-రాష్ట్రాల వాటా ఎంతెంత ?

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలంటే కోట్లాది డోసుల వ్యాక్సిన్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీస ధర ప్రకారం చూసినా వేల కోట్లు ఖర్చవుతుంది. ఇంత డబ్బు కేంద్రం వద్ద లేదు. దీంతో రాష్ట్రాలను కూడా ఇందులో భాగస్వాములు కావాలని కేంద్రం కోరబోతోంది. అయితే ఇందులో కేంద్రం, రాష్ట్రాలు ఎంతెంత వాటా ఉండాలన్న దానిపైనా మల్లగుల్లాలు తప్పడం లేదు. ప్రస్తుతం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం వాటా భరించేలా చర్చించాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై రాష్ట్ర్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలే కరోనాతో కుదేలైన తమ రాష్ట్ర్రాలు అంత మొత్తం భరించలేమంటున్నాయి. దీంతో ప్రత్యామ్నాయాలపై చర్చ జరుగుతోంది.

English summary
After central government's plans on covid vaccination, the crucial questions about the vaccine rollout in india remain unanswered, including funding options, geographical distribution of vaccines, and the extent of regulatory discretion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X