డీలిమిటేషన్ పై మారిన కేంద్రం నిర్ణయం, ఇక అప్పుడే..!?
నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు. 2029 ఎన్నికల్లోగా పూర్తయ్యేనా. ఇప్పుడు కేంద్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో డీలిమిటేషన్ పై కొత్త చర్చ మొదలైంది. కేంద్రం మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు పైన తర్జన భర్జన పడుతోంది. ఎలాగైనా ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆమోదించేలా వ్యూహాలు సిద్దం చేసింది. అయితే, కేంద్రం లో కొత్త చర్చ మొదలైంది. దీంతో... డీలిమిటేషన్ వ్యవహారం పైన కొత్త ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయని సమాచారం.
డీలిమిటేషన్ బిల్లు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించకపోవడం (ప్రోరోగ్ చేయకపోవడం) వెనుక భారీ వ్యూహం ఉందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లును ఆమోదం పొందేలా కేంద్రం వ్యూహాలు సిద్దం చేస్తోందని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు. సంఖ్యా పరంగానూ జాగ్రత్త పడుతోంది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీ చీలిక ఎంపీలతో పాటుగా డీఎంకే నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. అందులో భాగంగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కు కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్ లో డీఎంకే చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ నెలాఖరు లోగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లులను ఆమోదం పొందే విధంగా బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు చెబుతూ వచ్చారు.

అభ్యంతరాలను పరిష్కరిస్తూ.. బిల్లు
అయితే, కేంద్రం ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ నాయకత్వం సిద్దం అవుతోంది. అందులో యూపీతో పాటుగా పంజాబ్ కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు మిత్రపక్షాలు కీలకంగా మారుతున్నాయి. అదే విధంగా ప్రాంతీయ పార్టీలతోనూ బీజేపీ నాయకత్వం విరోధం కోరుకోవటం లేదు. డీఎంకే తోనూ సఖ్యతగా ఉండాలని భావిస్తోంది. దీంతో.. అందరినీ మెప్పించే ఫార్ములాతోనే డీలిమిటేషన్ పైన ముందుకు వెళ్లాలని కేంద్రం డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా డీఎంకే సూచిస్తున్న ఫార్ములా బిల్లులో స్పష్టం చేసి వారి మద్దతు పొందే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా శిరోమణీ అకాలీ దళ్, ఎన్డీఏ చేరేందుకు సిద్దంగా ఉన్న ఎన్సీపీ శరద్ పవార్ వర్గం చేస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకుంటోంది. ఈ కారణాలతో డీలిమిటేషన్ వ్యవహారం పైన కేంద్రం తీసుకునే తుది నిర్ణయం ఏంటనేది రాజకీయం గా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications
