కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మూడు నెలల క్రితం కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కారు అతివేగం, సీటు బెల్టు ధరించకపోవడంతోపాటు ప్రమాదం జరిగిన వంతెన వద్ద క్రాష్ బారియర్లు లేకపోవడం కూడా ఓ కారణమని వార్తలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వంతెనలపై రెయిలింగ్స్ తొలగించి వాటి స్థానంలో క్రాష్ బారియర్లు ఏర్పాటు చేయబోతున్నారు.
కేంద్ర రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల.. అన్ని రాష్ట్రాలు, జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. వంతెనలపై రాకపోకలు సాగించే వాహనాలను భద్రత కల్పించాలని, అందుకు క్రాష్ బారియర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది చాలా అత్యవసరమని ఆ సర్క్యులర్ లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వంతెనలను వెడల్పు చేయకుండా రెయిలింగ్స్ మార్చడంవల్ల ప్రయోజనముంటుందా? లేదా? అనే కోణంలో మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. రెయిలింగ్స్ స్థానంలో క్రాష్ బారియర్లు ఏర్పాటు చేసేముందు కొన్ని కీలక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఫుట్‌పాత్ ఉన్నా లేకపోయినా కొత్తగా నిర్మించే వంతెలకు క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని అందులో వెల్లడించారు. రెండు లేన్లతో ఉన్న వంతెనలన్నీ వెడల్పు చేసినా చేయకపోయినా లోపలి వైపు క్రాష్ బారియర్లు.. బయటివైపు పాదచారుల రెయిలింగ్స్‌ను ఏర్పాటు చేయడం తప్పనిసరని, నాలుగు లేన్లతో ఉన్న వంతెనలకైతే రెయిలింగ్స్ తొలగించి క్రాష్ బారియర్లను అమర్చాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళుతుండగా పాల్ఘార్ జిల్లాలో సూర్యనది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్‌ను ఢీకొన్న ఘటనలో మిస్త్రీతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications