వచ్చే ఏడాది నుంచి కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి: కేంద్రం, మిస్త్రీ మరణం ఎఫెక్ట్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. అక్టోబర్ 2023 నుంచి ప్యాసింజర్ వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కేంద్రం తప్పనిసరి చేసింది.
మోటారు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులందరి ఖర్చు, వేరియంట్‌లతో సంబంధం లేకుండా వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం స్పష్టం చేశారు.
'ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రపంచ సరఫరా గొలుసు పరిమితులు, స్థూల ఆర్థిక దృష్టాంతంపై దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ప్యాసింజర్ కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను 01 అక్టోబర్ 2023 నాటికి తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించారు.

ప్రయాణీకులందరికీ సీట్‌బెల్ట్ తప్పనిసరి
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత.. నిపుణులు, విమర్శకులు రవాణా, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపారు. కారు ప్రయాణీకుల కోసం సీటుబెల్ట్‌లను నియంత్రించే చట్టాలపై ఎప్పటికీ అంతులేని ఊహాగానాల మధ్య, ప్రభుత్వం సెప్టెంబర్‌లో కారులో ప్రయాణీకులందరికీ సీట్‌బెల్ట్‌ను తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించినవారు భారీ జరిమానా తప్పదు.
Considering the global supply chain constraints being faced by the auto industry and its impact on the macroeconomic scenario, it has been decided to implement the proposal mandating a minimum of 6 Airbags in Passenger Cars (M-1 Category) w.e.f 01st October 2023.
— Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022
సైరస్ మిస్త్రీ ప్రమాదం:
2012- 2016 మధ్యకాలంలో టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడు సైరస్ మిస్త్రీ ఇటీవల ముంబై-అహ్మదాబాద్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మిస్త్రీ, మరో ముగ్గురితో కలిసి గుజరాత్ నుంచి మహారాష్ట్రకు వెళ్తుండగా పాల్ఘర్ జిల్లాలో వారి కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
సైరస్ మిస్త్రీ, అతని స్నేహితుడు జహంగీర్ పండోల్ అక్కడికక్కడే మరణించగా, ఇతర ఇద్దరు ప్రయాణీకులు - గైనకాలజిస్ట్ అనహిత పండోల్, ఆమె భర్త డారియస్ పండోల్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. అనహిత పండోలే కారు నడిపారు. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు పోవడానికి ఒకటి సీట్ బెల్టు పెట్టుకోకపోవడం, మరొకటి కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్ లు లేకపోవడం. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆరు ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి చేసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications