ఆప్ఘన్ జాతీయులకు కేంద్రం షాక్-గతంలో ఇచ్చిన వీసాలు రద్దు-కొత్తగా ఈ-వీసా తీసుకోవాల్సిందే

ఆప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో అక్కడి స్ధానికుల్ని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్న కేంద్రం.. ఇవాళ వారికి భారీ షాకిచ్చింది. గతంలో ఆప్ఘనిస్తాన్ తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో వారికి జారీ చేసిన అన్ని వీసాల్ని తక్షణం రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ఇవాళ ప్రకటించింది.

ఆప్ఘనిస్తాన్ లో తాజాగా నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో చాలా మంది ఆప్ఘన్ జాతీయుల పాస్ పోర్టులు గల్లంతయ్యాయి. తాలిబన్ల దాడులతో వివిధ ప్రాంతాలకు పారిపోయి తలదాచుకుంటున్న వీరు పాస్ పోర్టులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. భారత్ కు వచ్చేందుకు గతంలో తీసుకున్న వీసాలు ఉన్నాయన్న ధీమాైతో ఉన్న వీరందరికీ ఇవాళ కేంద్రం షాకిచ్చింది. గతంలో ఆప్ఘన్ వాసులకు తాము జారీ చేసిన వీసాలేవీ ఇక చెల్లవని ప్రకటించింది.

ఆప్ఘన్ జాతీయులెవరైనా భారత్ రావాలంటే ప్రస్తుతం జారీ చేస్తున్న ఈ-వీసాలకు దరఖాస్తు చేసుకుని తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆప్ఘన్ సంక్షోభం నేపథ్యంలో తాము ఇస్తున్న ఈ-ఎమర్జన్సీ ఎక్స్ మిస్క్ వీసాల్ని తీసుకున్న వారినే తమ దేశంలోకి అనుమతిస్తాని కేంద్రం స్పష్టం చేసింది. ఆప్ఘన్ నుంచి భారత్ రావాలనుకుంటున్న అక్కడి జాతీయులంతా ప్రస్తుతం www.indianvisaonline.gov.in వెబ్ సైట్ లో వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ ఇవాళ కోరింది. అప్పుడు వీటిని పరిశీలించి వీసాలు జారీ చేస్తామని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జారీ చేసిన వీసాలతో ఆప్ఘన్ జాతీయుల్లో తాలిబన్లు కూడా భారత్ వచ్చే ప్రమాదమున్నట్లు సమాచారం.

central government says e-visa must for afghan nationals travelling to India, cancel all old visas

భారత్ ప్రస్తుతం ఆప్ఘన్ వాసులకు జారీ చేస్తున్న ప్రత్యేక వీసాల చెల్లుబాటు కోసం ఆరునెలల గడువు మాత్రమే ఇస్తున్నారు. ఆప్ఘన్ సంక్షోభం ముగిసేలోపు మాత్రమే ఈ వీసాలు చెల్లుబాటు కానున్నాయి. ఆ తర్వాత ఈ వీసాలు చెల్లవు కాబట్టి వారంతా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీంతో ఆప్ఘన్ వాసులంతా భారత్ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు భారత్ లో ప్రస్తుతం ఉన్న పౌరసత్వం, వలస, ఎన్నార్సీ నిబంధనల ప్రకారం ఆప్ఘన్ నుంచి వచ్చే వారికి భారత్ లో ప్రవేశం లేదు. కానీ ఆప్ఘన్ సంక్షోభం నేపథ్యంలో మానవతా దృక్పథంతో కేంద్రం తాత్కాలికంగా ఈ-వీసాలతో వీరిని అనుమతిస్తోంది. వీటికి ఇచ్చిన ఆరు నెలల గడువు పూర్తి కాగానే ఆప్ఘన్ జాతీయులంతా తిరిగి వెళ్లిపోవాలనే నిబంధనతో వీటిని జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+