వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయోలాజికల్ ఇ కార్బెవాక్స్‌ను బూస్టర్ డోసుగా ఆమోదించిన కేంద్రం: పెద్దలందరికీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది.
కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్‌తో పూర్తిగా టీకాలు వేసిన 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు రోగనిరోధక మోతాదు(బూస్టర్ డోసు)గా బయోలాజికల్ ఇ కార్బెవాక్స్‌ను ప్రభుత్వం అధీకృతం చేసిందని వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.

కోవిడ్‌కు వ్యతిరేకంగా ప్రారంభ ఇమ్యునైజేషన్ కోసం ఉపయోగించిన బూస్టర్ డోసేజ్‌కు భిన్నంగా అనుమతించబడటం దేశంలో ఇదే మొదటిసారి.
నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) COVID-19 వర్కింగ్ గ్రూప్ నుంచి ఇటీవలి సిఫార్సుల ఆధారంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు క్లియరెన్స్ ఇచ్చింది.

central Govt Approves Biological E’s Corbevax As Booster Dose For Adults Vaccinated With Covaxin, Covishield

"18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి Covaxin లేదా Covishield వ్యాక్సిన్‌ల రెండవ డోస్‌ను ఆరు నెలలు లేదా 26 వారాలు పూర్తి చేసిన తర్వాత కార్బెవాక్స్ ముందు జాగ్రత్త మోతాదుగా పరిగణించబడుతుంది. తద్వారా Corbevaxను వైవిధ్యమైన COVID-19 వ్యాక్సిన్‌గా ఉపయోగించడం సాధ్యమవుతుంది అని పేర్కొంది.

ఇది కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్.. హోమోలాగస్ ప్రొఫిలాక్టిక్ డోసేజ్ డెలివరీ కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలకు అదనంగా ఉంటుంది. Co-WIN ఇంటర్‌ఫేస్ ద్వారా Corbevax టీకా ముందుజాగ్రత్త మోతాదు నిర్వహణకు అవసరమైన అన్ని సర్దుబాట్లు చేయబడుతున్నాయి.

Corbevax, భారతదేశం మొట్టమొదటి దేశీయంగా తయారు చేయబడిన RBD ప్రొటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్. ఇప్పుడు COVID-19 ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రోగనిరోధక శక్తిని అందించడానికి ఉపయోగించబడుతోంది. కాగా, ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను బూస్టర్ డోసుగా ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, కార్బివాక్స్ కూడా బూస్టర్ డోసుగా ఇవ్వనున్నారు. కార్బెవాక్స్ ను అభివృద్ధి చేసింది హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ.

English summary
central Govt Approves Biological E’s Corbevax As Booster Dose For Adults Vaccinated With Covaxin, Covishield.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X