పెరుగుతున్న బియ్యం ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో రోజుకు రోజుకు పెరుగుతున్న బియ్యం ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాస్మతి కాకుండా ఇతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) గురువారం నోటిపికేషన్ జారీ చేసింది.
పాక్షికంగా మరపెట్టిన, పూర్తిగా మరపెట్టిన పాలిష్ చేయని తెల్లటి బియ్యం ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫికేషన్ వెలువడడానికి కంటే ముందే ఓడల్లో బియ్యాన్ని లోడ్ చేయడం ప్రారంభించి ఉంటే అలాంటి ఎగుమతులకు అనుమతిస్తామని డీజీఎఫ్టీ పేర్కొంది. ఇక ఆహార భద్రత అవసరాల కింద ప్రభుత్వం అనుమతించిన దేశాలకు బియ్యం ఎగుమతులను మినహాయించారు.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో చాలా చోట్ల వరినాట్లు ఆలస్యమయ్యాయి. మరోవైపు, ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తున్న కారణంగా మరికొన్ని చోట్ల పంట నాశనమైంది. ముఖ్యంగా ఉత్తరాదిలో పంజాబ్, హర్యానాలో పంట దెబ్బతింది. దీంతో బియ్యం ఉత్పత్తిపై ప్రభావం అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది.
ఇప్పటికే దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో బియ్యం ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంది. గతంలోనూ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. సరఫరా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మళ్లీ నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా, బియ్యం ధరలను కట్టడి చేసేందుకు నిషేధం విధించింది.
కాగా, బియ్యం దేశీయ ధరలు పెరుగుతున్న ధోరణిలో ఉన్నాయి. రిటైల్ ధరలు ఏడాదిలో 11.5 శాతం, గత నెలలో 3 శాతం పెరిగాయి' అని డీజీఎఫ్టీ పేర్కొంది.ధరను తగ్గించడంతోపాటు దేశీయ మార్కెట్‌లో లభ్యతను నిర్ధారించడానికి బాస్మతియేతర తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం సెప్టెంబర్ 8, 2022న విధించబడింది. అయితే, ఈ రకం ఎగుమతి గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్-మార్చి కాలంలో 33.66 లక్షల టన్నుల నుంచి 2022-23 సెప్టెంబర్-మార్చి కాలంలో 42.12 లక్షల టన్నులకు పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, సుమారు 15.54 లక్షల టన్నుల తెల్ల బియ్యం ఎగుమతి చేయబడింది. గత ఏడాది ఇదే కాలంలో 11.55 లక్షల టన్నులు మాత్రమే ఎగుమతి చేయబడింది, అంటే 35 శాతం పెరుగుదల. తాజాగా, బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో దేశంలోని వినియోగదారులకు తక్కువ ధరలకు బియ్యం లభించనున్నాయి.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications