రైతుల ఖాతాల్లో ఇక నుంచి రూ 10 వేలు - కేంద్రం నిర్ణయం..!?

కొత్త సంవత్సరం వేళ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అటు జమిలి ఎన్నికలకు కేంద్రం కసరత్తు చేస్తున్న వేళ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. మరో వారం రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 2025 కేంద్రానికి రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఈ వేళ.. ఓట్ బ్యాంకు ను సుస్థిరం చేసుకునే క్రమంలో రైతులకు మరింత గా దగ్గరయ్యేలా ఈ రోజు జరిగే కేంద్ర మంత్రివర్గ భేటీలో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

రూ 10 వేలకు పెంపు
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంపు దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ 2019 నుంచి ప్రతీ ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ 6 వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ 2 వేల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.10 వేలకు పెంచేందుకు కేంద్రం నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ రోజున కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా రూ.10 వేలు జమ అయ్యేలా నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తారని ప్రచారం సాగుతోంది.

Central govt likely to increase the PM-KISAN installment amount to Rs 10000 as latest reports

నేటి భేటీలో చర్చ
కొంత కాలంగా కిసాన్‌ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని.. ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కొత్త లక్ష్యాల వేళ ముందుగానే ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, దీని పైన ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద కేంద్రం ఇప్పటి వరకు 18 వాయిదాలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. వచ్చే నెల మలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జయ చేయనుంది. ఈ దశలో కేంద్రం నిర్ణయం ఏంటనేది నేడు స్పష్టత రానుంది.

పేదలకు రెండు కోట్ల ఇళ్లు
అదే సమయంలో మరో కీలక నిర్ణయం పైన కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించే విషయంపై సర్వే జరిపించాలని కేంద్రం ఇప్ప టికే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 31లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని కేంద్రం భావి స్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. అదే విధంగా ప్రజలు స్వయంగా పాల్గొనేలా ఆవాస్ 2024 పేరుతో ఒక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా ప్రజలు సర్వేలో పాల్గొనవచ్చని అధికారులు వెల్లడించారు.
2024 ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇక, ఇప్పుడు హామీల అమల్లో భాగంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+