జల్లికట్టుకు కేంద్రం అనుమతి: మోడీకి జయ కృతజ్ఞతలు

న్యూఢిల్లీ/చెన్నై: పొంగల్ పర్వదినం సందర్భంగా తమిళనాడులో సంప్రదాయ బద్ధంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు జల్లికట్లు నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చిందని స్వయంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తనకు ఫోన్‌ చేసి తెలిపారని కేంద్ర మంత్రి పన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు.

Centre allows jallikattu, AIWB likely to challenge

ఈ సందర్భంగా జల్లికట్టు నిర్వహణకు మద్దతిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాధాకృష్ణన్‌ ట్వీట్‌ చేశారు. జల్లికట్టు విధానంపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

కాగా, సంప్రదాయానికి తగినట్లుగా ఆటను నిర్వహించేందుకు చట్టంలో సవరణలు తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 2014లో జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధించిన విషయ తెలిసిందే.

Centre allows jallikattu, AIWB likely to challenge

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె మోడీకి లేఖ కూడా రాశారు. కాగా, కేవలం వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసమే కేంద్రం జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే సంప్రదాయానికి తగినట్లుగా ఆటను నిర్వహించేందుకు చట్టంలో సవరణలు తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+