గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం
సంఘటిత రంగ కార్మికుల గ్రాట్యుటీ పరిమితిని కేంద్రం పది లక్షల రూపాయల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.
న్యూఢిల్లీ: సంఘటిత రంగ కార్మికుల గ్రాట్యుటీ పరిమితిని కేంద్రం పది లక్షల రూపాయల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏడో వేతన సంఘంలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీ సీలింగును రూ.20 లక్షలకు పెంచారు. ఇప్పుడు గ్రాట్యుటీ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే ప్రయివేటు రంగ ఉద్యోగులకూ ఆ భాగ్యం కలగనుంది.

కాగా, ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 4 శాతం నుంచి 5 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, అరవై ఒక్క లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
గడిచిన జూలై ఒకటో తేది నుంచి పెరిగిన డీఏ అమల్లోకి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాదికి మూడు వేల కోట్లకు పైగా భారం పడుతుంది.












Click it and Unblock the Notifications