జూన్ 25న సంవిధాన్ హత్యా దివాస్: కేంద్రం గెజిట్, కాంగ్రెస్ ఫైర్
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన జూన్ 25న రాజ్యాంగ 'హత్యాదినం' (Samvidhan Hatya Divas)గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించటం ద్వారా తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించటమే కాకుండా ప్రజాస్వామ్య ఆత్మను ఉరితీశారని ఆయన విమర్శించారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలోకి తోశారని, మీడియాపై ఆంక్షలు విధించారని ధ్వజమెత్తారు.

ఈ కారణంగానే ప్రతి ఏడాది జూన్ 25న సంవిధాన్ హత్యా దినంగా జరపాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
మరోవైపు, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తు చేస్తుందన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు ఇది అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న వేళ.. కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
On June 25, 1975, the then PM Indira Gandhi, in a brazen display of a dictatorial mindset, strangled the soul of our democracy by imposing the Emergency on the nation. Lakhs of people were thrown behind bars for no fault of their own, and the voice of the media was silenced.
— Amit Shah (@AmitShah) July 12, 2024
The… pic.twitter.com/9sEfPGjG2S
25న అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీ
రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కొద్దిసేపటికే ఇందిరా గాంధీ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇది ఇలావుంటే, ఎమర్జెన్సీ విధించిన రోజును రాజ్యాంగ హత్యాదినంగా నిర్వహించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇది కేవలం హెడ్లైన్లలో నిలవడానికి ప్రధాని మోడీ వేసిన ఎత్తుగడగా అభిప్రాయపడింది. పదేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోడీని జూన్ 4న నైతికంగా ప్రజలు ఓడించారని, ఆ రోజు మోడీ ముక్త్ దివస్‌గా చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. కేంద్ర నిర్ణయం దేశ రాజ్యాంగం విలువలు, సంప్రదాయాలు, సంస్థలపై క్రమబద్దంగా చేస్తున్న దాడి అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications