జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!
జాతీయ రాజకీయం కీలక మలుపు తీసుకుంది. మోదీ 4.0 దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. అంతు చిక్కని వ్యూహాలతో మోదీ - షా ద్వయం నిర్ణయాలు అమలుకు సిద్దమైంది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ఇందుకు వేదిక కానున్నాయి. పెండింగ్ లో ఉన్న కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది. జమిలి.. డీలిమిటేషన్ అమలు దిశగా కార్యాచరణ వేగవంతం అయింది. అమలు ముహూర్తం ఫిక్స్ చేసారు.
కేంద్రంలోని బీజేపీ నాయకత్వం కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. గత సెషన్ లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్లు - డీలిమిటేషన్ బిల్లును పూర్తి స్థాయిలో అమోదం పొందే విధంగా వ్యూహాల ను సిద్దం చేసింది. జమిలి బిల్లును సైతం ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తోంది. రెండు దశల్లో జమిలి అమలుకు వీలుగా బిల్లు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందుగా కేంద్రం తాజా ఆదేశాలు ఆసక్తి కరంగా మారాయి. జమిలి ఎన్నికలతో సహా పార్లమెంట్ సంయుక్త కమిటీల(జేపీసీ) పరిశీలనలో ఉన్న అన్ని బిల్లులపై నివేదికలను జూలై 20 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లోనే సమర్పించాలని కేంద్రం సూచన చేయటం కీలకంగా మారుతోంది. జమిలి ఎన్నిక ల పైన బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని 39 మంది సభ్యుల కమిటీ తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతోంది. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్‌కు సంబంధించిన బిల్లుపై ఏర్పర్చిన జేపీసీ నివేదికను చైర్మన్ పురంధేశ్వరి ఈ సమావేశాల్లోనే సమర్పించనున్నారు.

పార్లమెంట్ సమావేశాల వేదికగా నిర్ణయాలు
వీటితో పాటుగా కేంద్రం మరో సంచలన బిల్లు పైన ఏర్పాటైన జేపీసీ సైతం తమ నివేదికను పార్ల మెంట్ కు సమర్పించేందుకు సిద్దం అవుతోంది. తీవ్రమైన ఆరోపణలపై 30 రోజులకు పైగా జైలు శిక్షను అనుభవించిన ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, రాష్ట్ర మంత్రులను తొలగించేందుకు రూపొందించిన మూడు బిల్లులను పరిశీలించేందుకు ఏర్పర్చిన జేపీసీ నివేదిక ఈ సమావేశాల్లో నే పార్లమెంట్ కు సమర్పించనున్నారు. సంఖ్యా పరంగానూ బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా, శివసేన థాకరే వర్గం, టీఎంసీ నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలు ఎన్డీఏకు మద్దతుగా ముందుకు వచ్చారు. దీంతో.. ఉభయ సభల్లోనూ కావాల్సిన బలం సమీకరణలో బీజేపీ చివరి ప్రయత్నాలు చేస్తోంది. అటు విపక్షాలు మాత్రం డీలిమిటేషన్ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించనీయ బోమని శపథం చేస్తున్నాయి. నెల రోజులు జైలులో ఉంటే పదవి నుంచి తెలిగించే బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దీంతో.. ఈ సారి పార్లమెంట్ సమావేశాల్లో జరిగే నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications