బెంగాల్‌లో మదర్సాలు, అలర్ట్‌గా ఉండాలన్న హోంశాఖ
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో జరగుతున్న హింసపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరుతో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్యకర్తలు చనిపోవడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు.
హింసపై దృష్టి ..
సార్వత్రిక ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు జరిగిన హింసపై కేంద్రం ఫోకస్ చేసింది. ఈ రెండు సందర్భాల్లో జరిగిన హింసను లెక్కగడుతుంది. ఇందులో హింస చెలరేగడానికి కారణమేంటీ ? ఎంతమంది చనిపోయారు ? ఎందరు గాయపడ్డారనే అంశంపై దృష్టిసారించింది. దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తున్నామని .. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్టు పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నించాలని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

బీ అలర్ట్ ...
రాష్ట్రంలోని బర్ద్వాన్, ముర్షిదాబాద్‌లో మదరాసీలు ఉన్నాయనే సమాచారం ఉందని పేర్కొన్నారు. కొందరిని ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించుకుంటుందని తెలిపారు. వారిని బంగ్లాదేశ్‌కు చెందిన జమాతే ఉల్ ముజాహీద్దిన్ సంస్థ ఉపయోగించుకుంటుందనే పక్కా సమాచారం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి .. అలర్ట్ చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం సలహాలు, సూచనలు తీసుకొని సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే జమాతే ఉల్ ముజాహీద్దిన్ అన్ని విభాగాలకు చెందిన కార్యకలపాలను 1967 చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిషేధించబడ్డాయనే విషయాన్ని గుర్తుచేశారు కిషన్ రెడ్డి.












Click it and Unblock the Notifications