వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్లకూ నకిలీల బెడద: కేంద్రం మార్గదర్శకాలు జారీ, అసలైనవి గుర్తించండిలా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ లక్షలాది మంది ప్రాణాలు తీస్తుండగా.. ఆ మహమ్మారి కట్టడికి అనేక పరిశోధనలు చేసి వ్యాక్సిన్లు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే, ఇప్పుడు కొందరు అక్రమార్కులు నకిలీ వ్యాక్సిన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నకిలీ వ్యాక్సిన్ల వాడకంతో బాధితుల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

నకిలీ వ్యాక్సిన్లను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కేంద్రం అప్రమత్తం

నకిలీ వ్యాక్సిన్లను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కేంద్రం అప్రమత్తం

ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో నకిలీ కోవిషీల్డ్ టీకాలు వ్యాప్తిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో వినియోగంలో ఉన్న కరోనా వ్యాక్సిన్లు నిజమైనవా.. కావా? అన్నది తేల్చేందుకు కొన్ని మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల తయారీదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వీటిని రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సిన్ తయారీదారులు ఉపయోగించే లేబుల్, ఇతర అంశాలను మార్గదర్శకాల్లో ప్రస్తావించింది.

నకిలీ వ్యాక్సిన్లపై కేంద్రం మార్గదర్శకాలు

నకిలీ వ్యాక్సిన్లపై కేంద్రం మార్గదర్శకాలు

ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పందించి.. రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు లేఖలు రాసింది. వినియోగానికి ముందు టీకాలను చాలా జాగ్రత్తగా ధృవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద పనిచేస్తున్న ప్రోగ్రామ్ మేనేజర్లు, సర్వీసు ప్రొవైడర్ల అవగాహన కోసం టీకా లేబుళ్లు, వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లకు సంబంధించిన అదనపు సమాచారాన్ని పంపింది. వీటిని ఆ సిబ్బంది జాగ్రత్తగా పాటించి, నకిలీ టీకాలను గుర్తించాలని స్పష్టం చేసింది.

అసలైన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను గుర్తించండిలా..

అసలైన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను గుర్తించండిలా..

అసలైన కోవిషీల్డ్ వయల్‌పై దాని తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్(ఎస్ఐఐ)కి సంబంధించిన లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. బ్రాండ్ పేరు, ట్రేడ్ మార్క్ దానిపై ఉంటాయి. టీకా వివరాలు, రీకాంబినెంట్ అని అన్‌బోల్డ్ అక్షరాల్లో ముద్రించారు. 'సీజీఎస్ నాట్ ఫర్ సేల్' అని కూడా ఉంటుంది. వయల్‌పై ముదురు ఆకుపచ్చ రంగులో అల్యూమినియం ఫ్లిప్-ఆఫ్-సీలును ఏర్పాటు చేశారు. ఎస్ఐఐ చిహ్నం ఏటవాలుగా ముద్రించి ఉంటుంది. అక్షరాలు తెల్ల రంగులో ఉంటాయి.

అసలైన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను గుర్తించండిలా..

అసలైన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను గుర్తించండిలా..

కోవాగ్జిన్ లేబుల్‌పై డీఎన్ఏ తరహా ఆకృతి ముద్రించి ఉంటుంది. ఇది అతినీల కాంతిలోనే కనపడుతుంది. అలాగే లేబుల్‌పై మైక్రో, కోవాగ్జిన్ పేరులోని 'ఎక్స్' పదంపై పచ్చ వర్ణం, కోవాగ్జిన్ పేరుపై అదనపు హాలో గ్రాఫిక్ ప్రభావం వంటివి ఉన్నాయి. కాగా, కోవాగ్జిన్ హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్ రెండూ కూడా దేశీయంగా ఉత్పత్తి చేయబడినవే. ప్రస్తుతం వీటిని కేంద్ర ప్రభుత్వమే పౌరులందరికీ ఉచితంగా అందిస్తోంది.

Recommended Video

పోలీసుల అక్రమకేసులకు భయపడేది లేదంటున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు || Oneindia Telugu
నిజమైన స్పుత్నిక్ వీ టీకాను గుర్తించండిలా..

నిజమైన స్పుత్నిక్ వీ టీకాను గుర్తించండిలా..

ఇక విదేశం నుంచి దిగుమతి చేసుకున్న మరో టీకా స్పుత్నిక్ వీ. ఈ స్పుత్నిక్ వీ టీకాను రష్యాలోని రెండు తయారీ సంస్థల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీని కారణంగానే లేబుళ్లు రెండు రకాలుగా ఉంటాయి. ఐదు యాంపిళ్లలతో కూడిన పెట్టెపై ముందు, వెనుక భాగాల్లో ఇంగ్లీష్ లేబుళ్లు ఉంటాయి. మిగితా రెండు భాగాలతోపాటు యాంపిల్‌పై ఉండే ప్రధాన లేబుల్ తోపాటు రష్యన్ భాష ముంద్రించి ఉంటుంది. వీటి ఆధారంగా అసలైన వ్యాక్సిన్లను గుర్తించాలని పేర్కొంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ తోపాటు స్పుత్నిక్ వీని మనదేశంలో పంపిణీ చేస్తున్నారు.

English summary
Centre Issues Guidelines To Identify Fake COVID-19 Vaccines, Here's full details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X