పాకిస్తాన్ కు కేంద్రం భారీ ఊరట..! ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి..!
కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు వరుసగా షాకులిచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా భారీ ఊరటనిచ్చింది. అప్పట్లో ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ కు చెందిన న్యూస్ ఛానళ్లతో పాటు అక్కడి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఉద్దేశంతో వాటి ప్రసారాలతో పాటు సోషల్ మీడియా, యూట్యూబ్ ఖాతాల్ని కేంద్రం భారత్ లో నిషేధించింది. తాజాగా ఈ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన పలు న్యూస్ ఛానళ్లతో పాటు సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో బారత్ లో వీటి ఉనికి లేకుండా పోయింది. అయితే ఇప్పుడు పరిస్ధితులు తిరిగి సాధారణ స్థితికి రావడంతో నిషేధాన్ని ఎత్తేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం మాత్రం అధికారికంగా వీటిని ఎత్తేస్తున్నట్లు ఎలాంటి ప్రకటనా చేయకపోవడం విశేషం.

అప్పట్లో కేంద్రం నిషేధం విధించిన పాకిస్తాన్ కు చెందిన పలు న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు తిరిగి కనిపిస్తున్నాయి. దీంతో కేంద్రం వీటిపై సైలెంట్ గా నిషేధం ఎత్తేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మారిన పరిస్దితుల నేపథ్యంలో భారత్ లో వీటి ప్రసారంపై విధించిన నిషేధం తొలగించినట్లు సమాచారం. అలాగేే అప్పట్లో నిషేధం విధించిన సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలుు కూడా ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. దీంతో వీటిపైనా కేంద్రం వెనక్కిి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అప్పట్లో కేంద్రం నిషేధించిన సబా కమర్, మావ్రా హొకేన్, అహద్ రజా మీర్, హనియా అమీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ వంటి పాకిస్తానీ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఇవాళ్టి నుంచి మన దేశంలో దర్శనమిస్తున్నాయి. అలాగే హమ్ టీవీ, ఏఆర్వై డిజిటల్, హర్ పాల్ జియో వంటి పాకిస్తానీ న్యూస్ ఛానళ్లు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌లను కూడా మళ్లీ ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంచారు.












Click it and Unblock the Notifications