సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ ఆయనే

న్యూఢిల్లీ: జ్యుడీషియరీ వ్యవస్థలో కీలకమైన సొలిసిటర్ జనరల్ ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అదనపు సొలిసిటర్ జనరళ్ల నియామకాలను కూడా భర్తీ చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 1వ తేదీ అంటే శనివారం నుంచి ఈ అపాయింట్‌మెంట్లన్నీ అమల్లోకి వస్తాయి.

ప్రస్తుతం సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా పని చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయననే మళ్లీ అదే పదవిలో కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. తుషార్ మెహతాను అదే స్థానంలో పునర్నియమించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది.

 Centre re-appoints Tushar Mehta as Solicitor General

జులై 1వ తేదీ నుంచి తుషార్ మెహతా నియామకం అమల్లోకి వస్తుంది. మూడు సంవత్సరాల పాటు ఆయన సొలిసిటర్ జనరల్‌గా కొనసాగుతారు. 2026 జూన్ 30వ తేదీ వరకు ఆ పదవిలో ఉంటారు. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్స్‌గా మరో ఆరుమందిని అపాయింట్ చేసింది. విక్రమ్‌జిత్ సింగ్, కేఎం నటరాజన్, బల్బీర్ సింగ్, ఎస్ వీ రాజు, ఎన్ వెంకటరామన్, ఐశ్వర్య భాటి అదపు సొలిసిటర్ జనరల్స్‌గా పునర్నియమితులయ్యారు.

వారిలో బల్బీర్ సింగ్, ఎస్ వీ రాజు, ఎన్ వెంకటరామన్, ఐశ్వర్య భాటీ రీ అపాయింట్‌మెంట్ ఇవ్వాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. మిగిలిన విక్రమ్‌జిత్ బెనర్జీ, కేఎం నటరాజన్‌ల పునర్నియామకం శనివారం నుంచి అమలవుతుంది. వారందరూ మూడు సంవత్సరాల పాటు అదే హోదాలో కొనసాగుతారు. ఈ మేరకు డీఓపటీ అండర్ సెక్రెటరీ అర్వింద్ థాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+